Raj Tarun : తెలంగాణ హైకోర్టులో రాజ్‌తరుణ్‌కు ఊరట..
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 8, 2024 / 04:58 PM IST
Raj Tarun
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లావణ్యతో పెళ్లి అయినట్లుగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. 20 వేల పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో లివింగ్ రిలేషన్ చట్టబద్ధమైనది కాదని హైకోర్టు తెలిపింది.
రాజ్‌తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని లావణ్య అనే యువతి ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రాజ్‌తరుణ్‌ను హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా రాజ్‌తురుణ్-లావణ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. లావణ్యతో రాజ్‌తరుణ్ చాలా కాలం సహజీవనం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2017 నుంచి ఆమెకు దూరంగా ఉంటున్నానని రాజ్‌తరుణ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు.
అయితే.. ఏడాది క్రితం వరకు తామిద్దరం కలిసే ఉన్నామని లావణ్య అంటోంది. తనకు రాజ్‌తరుణ్ కావాలని అంటోంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడని లావణ్య ఆరోపణలు చేస్తోంది. మీడియా సమావేశాలు నిర్వహించి రాజ్ తరుణ్ మీద ఎన్నో రకాలుగా లావణ్య ఆరోపణలు చేసింది.
Hari Hara Veera Mallu : పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్.. సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ కూడా..
