Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అప్‌డేట్‌.. సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ కూడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న‌టిస్తున్న సినిమాల్లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఒక‌టి.

Hari Hara Veera Mallu : ప‌వ‌న్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ అప్‌డేట్‌.. సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ కూడా..

Anupam Kher in Pawan Kalyan Hari Hara Veera Mallu

Updated On : August 8, 2024 / 3:08 PM IST

Hari Hara Veera Mallu – Anupam Kher : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ఒక‌టి. ఈ సినిమాను ప్ర‌క‌టించి మూడేళ్లు దాటింది. మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంచెం షూట్ చేయడం, మళ్ళీ ఆగిపోవడం జరుగుతూనే ఉంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వ‌డం కూడా ఈ మూవీ ఆల‌స్యానికి ఓ కార‌ణం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను మొద‌లుపెట్ట‌గా ప‌లు కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. 17వ శతాబ్దానికి చెందిన కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వారియర్ గా నటిస్తున్నారు. అప్పుడెప్పుడో ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. గ‌త‌కొంత‌కాలంగా ఈ మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో అభిమానులంతా ఎంతో నిరాశ‌లో ఉన్నారు.

Aha Ott : ‘ఆహా’లో బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ సినిమాలు..

తాజాగా చిత్ర బృందం ఓఅప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ న‌టుడు అనుప‌మ్ కేర్ న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఈ సినిమాలో ఆయ‌న ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది. ప‌వ‌ర్ స్టార్ తొలిసారి లెజెండ‌రీ న‌టుడు అనుప‌మ్ ఖేర్‌తో తెర‌ను పంచుకోనున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రిస్తాయ‌ని నిర్మాత‌లు చెబుతున్నారు.

ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వర‌లోనే మిగిలిన సినిమా షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది. రెండు భాగాలుగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.

Manish Malhotra : చైతన్య – శోభిత నిశ్చితార్థానికి డ్రెస్సులు డిజైన్ చేసింది నేనే.. స్టార్ ఫ్యాషన్ డిజైనర్ పోస్ట్ వైరల్..