Aha Ott : ‘ఆహా’లో బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ సినిమాలు..

రెండు థ్రిల్లర్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఆహాలో రిలీజ్ అవుతున్నాయి.

Aha Ott : ‘ఆహా’లో బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ సినిమాలు..

Birthmark and Derick Abraham Two Thriller Movies in Aha OTT

Updated On : August 8, 2024 / 2:58 PM IST

Aha Ott Thrilling Movies : తెలుగు ఓటీటీ ఆహాలో రెగ్యులర్ గా కొత్త సినిమాలు, షోలు వస్తూనే ఉన్నాయి. తాజాగా బ్యాక్ టు బ్యాక్ రెండు డబ్బింగ్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘డెరిక్ అబ్రహం’ అక్కడ హిట్ అవ్వగా ఆ సినిమాని ఇప్పుడు మన తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. శనివారం ఆగస్టు 10 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ కానుంది.

అలాగే షబీర్, మిర్నా మీనన్ జంటగా నటించిన థ్రిల్లర్ సినిమా ‘బర్త్ మార్క్’ కూడా మలయాళంలో హిట్ అవ్వగా ఇప్పుడు ఆహా ఓటీటీలో తెలుగులో డబ్ అయి వచ్చింది. ఈ సినిమా ఆల్రెడీ నేడు ఆగస్టు 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. భవానీ మీడియా ద్వారా ఈ రెండు థ్రిల్లర్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఆహాలో రిలీజ్ అవుతున్నాయి.