Manish Malhotra : చైతన్య – శోభిత నిశ్చితార్థానికి డ్రెస్సులు డిజైన్ చేసింది నేనే.. స్టార్ ఫ్యాషన్ డిజైనర్ పోస్ట్ వైరల్..

నిశ్చితార్థంలో చైతన్య, శోభిత వేసుకున్న సాంప్రదాయ డ్రెస్సులు డిజైన్ చేసింది బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్.

Manish Malhotra : చైతన్య – శోభిత నిశ్చితార్థానికి డ్రెస్సులు డిజైన్ చేసింది నేనే.. స్టార్ ఫ్యాషన్ డిజైనర్ పోస్ట్ వైరల్..

Bollywood Fashion Designer Manish Malhotra Designed Special Traditional Dresses for Naga Chaitanya Sobhita Dhulipala Engagement

Updated On : August 8, 2024 / 2:34 PM IST

Manish Malhotra : నాగచైతన్య, శోభిత ధూళిపాళ నేడు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నారు. నాగార్జున వీరి నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసి అధికారికంగా ఈ విషయం ప్రకటించాడు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. చైతన్య, శోభిత ఇద్దరూ కూడా నిశ్చితార్థం ఈవెంట్లో సాంప్రదాయంగా రెడీ అయ్యారు.

అయితే ఈ నిశ్చితార్థంలో చైతన్య, శోభిత వేసుకున్న సాంప్రదాయ డ్రెస్సులు డిజైన్ చేసింది బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. బాలీవుడ్, టాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ కి, వాళ్ళ పర్సనల్ ఈవెంట్స్ కి మనీష్ మల్హోత్రానే బట్టలు డిజైన్ చేస్తాడు. ఇప్పుడు శోభిత – చైతన్య ఎంగేజ్మెంట్ కి కూడా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసాడు. దీని గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

Also Read : Naga Chaitanya – Sobhita Dhulipala : నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత.. ఫొటోలు వైరల్..

చైతన్య – శోభిత నిశ్చితార్థం ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి మనీష్ మల్హోత్రా.. ఆంధ్రప్రదేశ్ లోని చేనేత కార్మికుల నుంచి వీటిని తయారుచేసాము. శోభిత ఈ పర్సనల్ మూమెంట్ కోసం తన మూలాలు రిఫ్లెక్ట్ అవ్వాలని వీటిని ఎంచుకుంది. ఆమె ఉప్పాడ పట్టు చీర ధరించింది. తెలుగింటి అమ్మాయిలా జడవేసుకొని కనకాంబరం పూలు పెట్టుకుంది. నాగచైతన్య సంప్రదాయమైన పట్టుపంచె లాల్చీ, కండువా ధరించాడు. బంగారపు అంచుతో స్పెషల్ గా డిజైన్ చేసాము అని చెప్పి ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ తెలిపాడు.