Naga Chaitanya – Sobhita Dhulipala : నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య, శోభిత.. ఫొటోలు వైరల్.. ఈ డేట్ లోనే ఎందుకో తెలుసా?
నాగార్జున ఈ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటిస్తూ నాగచైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Nagarjuna Shares Naga Chaitanya Sobhita Dhulipala Engagement Photos and Announced Their Relation
Naga Chaitanya – Sobhita Dhulipala : నాగ చైతన్య, సమంత గతంలో ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత చైతన్య నటి శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రూమర్స్ ని నిజం చేసారు ఈ జంట. నేడు ఉదయం నాగచైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థం నాగార్జున ఇంట్లో కేవలం కేవలం కుటుంబ సభ్యుల మధ్యే సింపుల్ గా జరిగింది.
నాగార్జున ఈ నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటిస్తూ నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఫోటోలను నాగార్జున షేర్ చేస్తూ.. నా కొడుకు నాగచైతన్య, శోభిత ధూళిపాళ నేడు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమెను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాము. కొత్త జంటకు కంగ్రాట్స్. లైఫ్ టైం హ్యాపీనెస్ తో కలిసి ఉండాలి అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అవ్వగా అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెప్తున్నారు.
“We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. ?… pic.twitter.com/buiBGa52lD— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
అయితే ఈ నిశ్చితార్థం డేట్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. సమంత నాగ చైతన్యకు ఆగస్టు 8నే ప్రపోజ్ చేసిందని అందుకే నాగచైతన్య అదే డేట్ కి శోభితని నిశ్చితార్థం చేసుకున్నాడని పలువురు పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ నిశ్చితార్థంపై సమంత స్పందిస్తుందా చూడాలి.