Pawan kalyan : అడవిలో స్మగ్లింగ్ చేసేవారిని హీరోలుగా చూపిస్తున్నారు.. సినిమాలపై పవన్ వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటకకు వెళ్లారు.

Andhra Pradesh Deputy CM Pawan kalyan
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటకకు వెళ్లారు. బెంగళూరులో సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. కొన్ని అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సినిమాలపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో వచ్చిన మార్పులపై ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడని అన్నారు. అయితే.. ప్రస్తుతం అడవుల్లోని చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడని అన్నారు. తాను సినిమాలకు సంబంధించిన వాడినేనని, అలాంటి పాత్రల్లో నటించడం ఇష్టం ఉండదన్నాడు.
పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు అనే చర్చ మొదలైంది. కొందరు ఇటీవల సంచలన విజయాన్ని అందుకున్న పుష్ఫ సినిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అంటుండగా.. పవన్ ఫ్యాన్స్ మాత్రం కాదని అంటున్నారు.
Also Read : పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్.. సినిమాలో ఆ బాలీవుడ్ స్టార్ కూడా..
సినిమాల ప్రభావం ఎంతో కొంత జనాలపై ఉంటుందని, కాబట్టి హీరోలుగా బాధ్యతాయుత మైన సినిమాల్లో నటించాలని చెప్పాడని చెబుతున్నారు. ప్రత్యేకించి ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లా పరిధిలోనూ, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా ఏనుగులు గ్రామాల మీద దాడిచేస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని పవన్ కల్యాణ్ సీఎం సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది.
Also Read: ‘ఆహా’లో బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్ సినిమాలు..