Tollywood Heroes: నటన, రచన, నిర్మాణం, దర్శకత్వం.. టాలీవుడ్ యంగ్ హీరోల ‘ఆల్ ఇన్ వన్’ షో
టాలీవుడ్ హీరోలు(Tollywood Heroes) ఇప్పుడు కేవలం హీరోలు మాత్రమే కాదు.
Tollywood heroes not only starring as leads but are also handling the story, production, and direction.
- నటనే కాదు అన్నింటా మాదే హవా.
- కథల భారం తగ్గిస్తున్న యంగ్ హీరోలు.
- ప్రయోగాలతో పాటు హిట్లు కూడా ఇవ్వండి.
Tollywood Heroes: ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా కథా రచన, దర్శకత్వం, నిర్మాణం వంటి విభాగాల్లోనూ రాణిస్తున్నారు. ఈ ధోరణి పరిశ్రమలో సరికొత్త క్రియేటీవ్ రెవెల్యూషన్ ను క్రియేట్ చేస్తోంది. ఈ తరం హీరోల్లో విశ్వక్ సేన్, అడివి శేష్ వంటి వారు నటనతో పాటు దర్శకత్వం, కథల రాయడంలో తమ మార్కు చూపిస్తున్నారు. విశ్వక్ సేన్ స్వయంగా సినిమాలను నిర్మిస్తూ, డైరెక్ట్ చేస్తూ మాస్ కా దాస్ అనిపించుకుంటుండగా, అడివి శేష్ తన సినిమాలకు తానే స్క్రీన్ ప్లే అందిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సిరీస్‌తో రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకోగా, నవీన్ పొలిశెట్టి కూడా స్క్రిప్ట్ వర్క్‌లో పాల్గొంటూ తన సినిమాలను బెస్ట్ గా మార్చుకుంటున్నాడు(Tollywood Heroes).
Akshay Kumar: బాలీవుడ్ కా బాద్షా.. అక్షయ్ కెరీర్లో వందకోట్ల సినిమాలు 20.. ఇది ఆల్ టైం రికార్డ్
ఈ జాబితాలోకి మంచు విష్ణు, కిరణ్ అబ్బవరం వంటి వారు కూడా చేరుతున్నారు. ఈమధ్య కాలంలో మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలతో పాటు కథా చర్చల్లో పాల్గొంటున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇప్పటికే హీరోగా, నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. త్వరలోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కూడా భవిష్యత్తులో దర్శకత్వం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా హీరోలే స్వయంగా కథలను సిద్ధం చేసుకోవడం వల్ల రచయితలపై భారం తగ్గడమే కాకుండా, సినిమాపై వారికి పూర్తి అవగాహన ఉంటోంది.
తమ కథలు తామే రాసుకోవడం, తమ సినిమాలకు తామే దర్శకత్వం వహించడం అనేది పరిశ్రమకు శుభపరిణామమే. అయితే, ఈ ప్రక్రియలో నాణ్యత తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం. తమలోని వివిధ కళలను ఆవిష్కరిస్తూనే, బాక్సాఫీస్ వద్ద భారీ హిట్లను అందించి టాలీవుడ్ మార్కెట్‌ను మరింత విస్తరించాల్సిన బాధ్యత ఈ స్టార్స్ పై ఉంది. కేవలం ప్రయోగాలు మాత్రమే కాకుండా, ప్రేక్షకులు మెచ్చే కమర్షియల్ సక్సెస్‌లను అందించడం ద్వారా ఈ మల్టీ-టాలెంటెడ్ హీరోలు పరిశ్రమను ముందుకు నడిపించాల్సిన భాద్యత కూడా ఉంది.
