నార్కోటిక్స్ బ్యూరో ఎంక్వైరీలో రకుల్ ప్రీత్‌సింగ్‌ ఏం చెప్పబోతోంది

  • Publish Date - September 24, 2020 / 06:54 PM IST

actress Rakul Preet Singh: ముందు తన పేరే లేదంది..ఠాఠ్ నా పేరు వాడితే ఊరుకోనంది..తర్వాత నార్కోటిక్స్ బ్యూరో నోటీసులు కూడా అందలేదంటూ కహానీలు చెప్పబోయింది..తీరా విషయం బైటపడేసరికి…చచ్చినట్లు ఎంక్వైరీకి హాజరవుతానంది ఇంటరాగేషన్‌లో ఇంకా పెద్ద పేర్లు బైటికి వస్తాయా…? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

రియా చక్రవర్తి అరెస్ట్‌తో బాలీవుడ్ మాత్రమే షేకవుతుండగా..రకుల్ ప్రీత్ ఎంక్వైరీతో టాలీవుడ్‌లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయ్..బైటికి కన్పించడం లేదు కానీ..సినిమా ఇండస్ట్రీలో రియా వాట్సాప్ చాట్ లీక్ పెద్ద సంచలనమే కలిగిస్తోంది.స్పాట్



గతవారంలో తన పేరు బైటికి రావడంపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైరైంది. తన పేరు వాడటానికి వీల్లేకుండా గాగ్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోర్టుని కూడా ఆశ్రయించింది. ఈలోపే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు పంపడంతో ఇక రకుల్ డ్రగ్స్ వాడిందా లేదా అనే వ్యవహారం తేలిపోనుంది

నార్కోటిక్స్ బ్యూరో రకుల్‌‌తో పాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ దీపికా పదుకోన్‌ని కూడా శుక్రవారం విచారిస్తోంది. రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన తర్వాత సిబిఐ, ఈడీ ఓ వైపు తమ ఎంక్వైరీ చేస్తుండగా, మరోవైపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పదిహేనుమంది వరకూ అరెస్ట్ చేసింది

డ్రగ్స్ వినియోగించడమేనా లేదంటే సరఫరా చేశారా అనే కోణంలోనే ఈ సెలబ్రెటీలను ఎన్‌సిబీ డ్రిల్ చేస్తోంది. సుశాంత్‌కి టాలెంట్ మేనేజర్లుగా వ్యవహరించిన జయాసాహా, శృతి మోదీలను ఇప్పటికే రోజుల తరబడి ప్రశ్నిస్తోన్న నార్కోటిక్స్ బ్యూరో, ఇదే విధంగా రకుల్ ప్రీత్ సింగ్‌ని విచారించొచ్చు.



రియా చక్రవర్తితో అత్యంత సన్నిహితంగా మెలిగిన రకుల్ ప్రీత్ సింగ్, ఆమె ద్వారానే డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కున్నారా లేదా అనే అంశం చర్చకు వస్తుండగా..బాలీవుడ్‌లో మంచి రిలేషన్స్ మెయిన్ టైన్ చేసే రకుల్ ప్రీత్ సింగ్‌కి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్. రియా చక్రవర్తితో కలిసి ఫ్యాషన్‌షోలు..చేయడమే కాదు..గంటల తరబడి జిమ్ములలో గడుపుతుంటారు

ఒకరికొకరు ప్రాణస్నేహితుల్లా ముద్దులు పెట్టుకున్న వీడియోలు కూడా నెట్‌లో చక్కర్లు కొడుతుంటాయ్, అందుకే రియా చక్రవర్తి అరెస్టైన తొలి రోజుల్లోనే కొంతమంది రకుల్ ప్రీత్ సింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. రకుల్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి పదేళ్లు. టాలీవుడ్‌లో అమెకంటూ సర్కిల్ ఏర్పాటు చేసుకుంది..వీళ్లంతా కలిసి పార్టీలు చేసుకుంటూ ఉంటారనేది అందరికీ తెలుసంటారు



హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి పాకిన డ్రగ్స్ కల్చర్టా లీవుడ్‌ కూడా అరువు తెచ్చుకున్నట్లు మూడేళ్ల క్రితమే గుప్పుమంది. ఎఫ్ 45 పేరుతో రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో ఓ ఫిట్‌నెస్ ఫ్రాంచైజీ కూడా రన్ చేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ టూ బాలీవుడ్‌ వలస వెళ్లిన రకుల్ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో కలకలం.

ఇంతకీ రకుల్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పబోతోంది..ఇంకా ఎవరెవరి పేర్లు చెప్పబోతోందన్నదే ఉత్కంఠ.