Samantha : ఎవరికి నచ్చినా నచ్చకున్నా.. సమంత పోస్ట్ వైరల్..

టాలీవుడ్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాలను చుట్టేస్తోంది. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా..

Tollywood Heroine Samantha shares a viral post on her instagram

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ప్రకటించి మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఒక పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే మానసికగా కూడా బలపడడానికి హ్యాపీ వెకేషన్స్ వేస్తుంది. ఈక్రమంలోనే అమెరికా, యూరప్ దేశాలను చుట్టేస్తోంది. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం సమంత ఆస్ట్రియాలోని ‘వియన్నా’లో ఉంది. ఇక అక్కడ నుంచి తాజాగా ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది.

ఒక షాప్ గోడ మీద.. Everybody’s Darling అని ఉంది. ఇక దాని ముందు సమంత నిలబడి ఫోటో దిగి, దానిని షేర్ చేస్తూ.. “Or not….I can live with both” అంటూ కామెంట్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ వెనుక సమంత అర్ధం ఏంటంటే.. “నేను ఎవరికి నచ్చినా నచ్చకున్నా. నేను ఇద్దరితో కలిసి జీవించగలను” అంటూ తెలియజేసింది. ఇక ఈ పోస్టు చూసిన హీరోయిన్ త్రిష.. నవ్వుతూ రిప్లై ఇచ్చింది. ఇక ఫొటోలోని సమంత లుక్స్ కూడా స్టైలిష్ గా ఉన్నాయి.

Also read : Leo Movie : లియో మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? సోషల్ మీడియాలో ట్రోల్స్..

మరి సమంత ఎంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండబోతుందో తెలియదు. ఇటీవల ‘ఖుషి’ సినిమాతో సమంత చివరి సరిగా బిగ్ స్క్రీన్ పై కనిపించింది. త్వరలో సామ్ నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. వరుణ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్ రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.