Tollywood : నేడు సీఎం, డిప్యూటీ సీఎంతో టాలీవుడ్ మీటింగ్.. చివరి నిమిషంలో క్యాన్సిల్..

నేడు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవాల్సి ఉంది.

Tollywood : ఇటీవల థియేటర్స్ ఇష్యూ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ థియేటర్స్, టాలీవుడ్ పై సీరియస్ అయి టాలీవుడ్ ప్రముఖులు సీఎం ని కలిసారా అని ప్రశ్నించడంతో టాలీవుడ్ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలవడానికి సిద్ధం అయ్యారు. అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ టాలీవుడ్ లో పలువురికి ఫోన్స్ చేసి మీటింగ్ కి ఆహ్వానించారు కూడా.

నేడు మొదట పవన్ కళ్యాణ్ ని కలిసి అనంతరం పవన్ తో కలిసి సీఎం చంద్రబాబు దగ్గరికి టాలీవుడ్ ప్రముఖులు వెళ్ళాలి. సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసే లిస్ట్ లో డైరెక్టర్ లు బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వినీ దత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు, హీరోలు.. బాలకృష్ణ, వెంకటేష్, మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని.. ఇలా దాదాపు 35 నుంచి 40 మంది ఉన్నారు. నేడు సాయంత్రం సీఎం చంద్రబాబును 4 గంటలకు కలవాల్సి ఉంది.

Also Read : Balakrishna – Allu Arjun : స్టేజి మీదకు వెళ్లి స్టెప్పులు వెయ్ బన్నీ.. గద్దర్ అవార్డ్స్ వేడుకల్లో బన్నీతో బాలయ్య సరదా.. వీడియో వైరల్..

కానీ ఈ మీటింగ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఈ మీటింగ్ కి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్ ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈ సమావేశం వాయిదా వేసినట్టు సమాచారం. అలాగే ఈ మీటింగ్ కి రావాల్సిన సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు కూడా అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు అయినట్టు తెలుస్తుంది.

సీఎం, డిప్యూటీ సీఎం ప్రభుత్వం తరపున పిలిచినా టాలీవుడ్ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో మరింత చర్చగా మారింది. మళ్ళీ ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఇక ఈ మీటింగ్ వాయిదా పడటంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ సమావేశం కూడా వాయిదా పడినట్టు సమాచారం.

Also Read : Telangana Gaddar Film Awards : ఘనంగా ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్’ కార్యక్రమం.. ఫుల్ ఫొటోలు..