Balakrishna – Allu Arjun : స్టేజి మీదకు వెళ్లి స్టెప్పులు వెయ్ బన్నీ.. గద్దర్ అవార్డ్స్ వేడుకల్లో బన్నీతో బాలయ్య సరదా.. వీడియో వైరల్..
బాలకృష్ణ, అల్లు అర్జున్ స్టేజి ముందు వరసలో పక్కపక్కనే కూర్చున్నారు.

Balakrishna Allu Arjun Funny Video from Telangana Gaddar Film Awards
Balakrishna – Allu Arjun : శనివారం జూన్ 14న రాత్రి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ఈవెంట్ ఘనంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే బాలకృష్ణ, అల్లు అర్జున్ స్టేజి ముందు వరసలో పక్కపక్కనే కూర్చున్నారు. బాలయ్య ఉంటే సరదా ఉంటుందని తెలిసిందే. బాలయ్య అల్లు అర్జున్ తో సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తమన్ స్టేజిపై స్పెషల్ ప్రోగ్రాం ఇచ్చారు. పలు సినిమాల్లోని సాంగ్స్ తో అలరించారు.
Also See : Telangana Gaddar Film Awards : ఘనంగా ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్’ కార్యక్రమం.. ఫుల్ ఫొటోలు..
దీంతో తమన్ పాటలు పాడేటపుడు బాలకృష్ణ అల్లు అర్జున్ ని వెళ్లి స్టేజిపై స్టెప్పులు వెయ్యి.. వెళ్ళు.. అంటూ సరదాగా హడావిడి చేసారు. ఇక అల్లు అర్జున్ అమ్మో వద్దు అంటూ బాలయ్యని ఆపారు. దీంతో బాలయ్య – అల్లు అర్జున్ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..