Tollywood : ఈ ఏడాది బాలీవుడ్‌ని టాలీవుడ్ హీరోలే కాపాడాలి అంటున్న హిందీ క్రిటిక్స్..

రిలీజ్ కి సిద్దమవుతున్న తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ని, గతంలో తెలుగు సినిమా సత్తాని చూసిన బాలీవుడ్ క్రిటిక్స్.. ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని తెలుగు హీరోలే కాపాడాలి అంటున్నారు.

Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ ఎరా నడుస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలితో మొదలైన ఈ సునామీ.. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ స్థాయిలో విజృంభిస్తుంది. అయితే గత ఏడాది ఒకటి రెండు తప్ప తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పెద్ద ప్రాజెక్ట్స్ ఏమి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్దకి రాలేదు. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసాయి.

ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని.. మేము కమ్‌బ్యాక్ ఇచ్చామని అన్నారు. అయితే ఈ ఏడాది బాలీవుడ్ లో ఒక బడా ప్రాజెక్ట్ కూడా కనిపించడం లేదు. ఆల్రెడీ రిలీజైన కొన్ని చెప్పుకోదగ్గ బడా హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఇక రిలీజ్ కి సిద్దమవుతున్న ‘సింగం ఎగైన్’ వంటి బడా ప్రాజెక్ట్ పై కూడా బాలీవుడ్ ఆడియన్స్ లో పెద్ద ఆసక్తి కనిపించడం లేదంటున్నారు అక్కడి క్రిటిక్స్.

దీంతో ఈ ఏడాది బాలీవుడ్‌ బాక్స్ ఆఫీస్ ని టాలీవుడ్ హీరోలే కాపాడాలి అంటున్నారు. ఈ ఇయర్ టాలీవుడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో మొదటిది అల్లు అర్జున్ పుష్ప 2. ఈ సినిమా పై నార్త్ లో ఎంతటి క్రేజ్ ఉందో సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఇక బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ ‘కల్కి 2898ఏడి’ మూవీ పై పాన్ వరల్డ్ లో ఆసక్తి కనిపిస్తుంది.

Also read : Vijay Deverakonda : విజయ్ దేవరకొండని ప్రశాంత్ నీల్ ఎందుకు కలుసుకున్నాడు..?

హిందూ పురాణాల్లోని పాత్రలను సూపర్ హీరోలుగా చూపిస్తూ ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా తీసుకువస్తుండడంతో.. ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ తరువాత ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్.. గేమ్ ఛేంజర్, దేవర సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాల పై కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక నాలుగు చిత్రాలకు బాలీవుడ్ లో ఓ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నాలుగు చిత్రాలకు బాలీవుడ్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ చూసి.. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాల థియేట్రికల్ రైట్స్ కోసం దాదాపు 400 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇక ఈ మార్కెట్‌ని, గతంలో తెలుగు సినిమా సత్తాని చూసిన తరణ్ ఆదర్శ్ వంటి బాలీవుడ్ క్రిటిక్స్.. ఈ ఏడాది బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని తెలుగు హీరోలే కాపాడాలి అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు