Ananda Rao : నంది అవార్డు గెలుచుకున్న నిర్మాత కన్నుమూత..

గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో వరుస మరణాలు చుటూ చేసుకుంటున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, కె విశ్వనాథ్, తారకరత్న.. ఇలా ఒకరి తరువాత ఒకరు కన్నుమూస్తూ టాలీవుడ్ ని శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా మరో విషాద వార్త తెలుగు పరిశ్రమని బాధిస్తుంది.

Ananda Rao : గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో వరుస మరణాలు చుటూ చేసుకుంటున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల, కె విశ్వనాథ్, తారకరత్న.. ఇలా ఒకరి తరువాత ఒకరు కన్నుమూస్తూ టాలీవుడ్ ని శోకసంద్రంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా మరో విషాద వార్త తెలుగు పరిశ్రమని బాధిస్తుంది. నంది అవార్డు అందుకున్న ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఆనందరావు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.

Balayya Strong Warning : దబిడి దిబిడే అంటున్న బాలయ్య

ప్రముఖ నవల ‘మిథునం’ ఆధారంగా తనికెళ్ళ భరణి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిథునం. ఈ సినిమాలో గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించారు. 2012 వచ్చిన ఈ చిత్రాన్ని ఆనందరావు నిర్మించారు. ఆనందరావుకి సాహిత్యం, పర్యావరణం అంటే ఎంతో ప్రేమ. స్వతహాగా కవిత్వాలు, పద్యాలు కూడా రాసేవాడు. అంతేకాదు వాటిని కోటిగాడు పేరుతో ప్రచురించి బయటికి కూడా రిలీజ్ చేశారు.

Nani – Vishwaksen : నాని, విశ్వక్ సేన్.. పాన్ ఇండియా సినిమాలతో వారం గ్యాప్‌తో గ్రాండ్ ఎంట్రీ

సాహిత్యం పై అంతటి ప్రేమ ఉండడం వలనే ఆనందరావు అందరి నిర్మాతలా కమర్షియల్ గా ఆలోచించకుండా, మిథునం వంటి సినిమా చేసేలా చేశారు. ఆ చిత్రం కూడా ఒక మధురమైన కావ్యంలా అందర్నీ ఆకట్టుకుంది. దీంతో ఆనందరావుకి 2017 లోనంది అవార్డుని తెచ్చి పెట్టింది. కాగా చాలా కాలంగా ఆనందరావు డయాబెటిక్‌ వ్యాధితో బడుతున్నారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు.

నిర్మాతగా, కవిగా, సమాజ సేవకుడిగా ఎన్నో సేవలు అందించిన ఆనందరావు మరణం అందర్నీ కలిచి వేస్తుంది. సినీ ప్రముఖులు ఆయన మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఆనందరావు స్వగ్రామం వావిలవలసలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు