Site icon 10TV Telugu

Chiranjeevi : టాలీవుడ్ సమ్మె ఎఫెక్ట్.. మెగాస్టార్ తో నిర్మాతల భేటీ.. చిరంజీవి ఏమన్నారంటే..

Tollywood Producers Meeting with Megastar Chiranjeevi Regarding Tollywood Strike

Chiranjeevi

Chiranjeevi : టాలీవుడ్ లో ప్రస్తుతం అనధికార సమ్మె నడుస్తుంది. ఏకంగా వేతనాలు 30 శాతం పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ చెప్పడంతో షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఫిలిం ఛాంబర్, నిర్మాతలు ఈ సమస్య పరిష్కారానికి ట్రై చేస్తున్నారు. ఇప్పటికే యూనియన్స్ తో సంబంధం లేకుండా ట్యాలెంట్ ఉన్న వాళ్ళను సినీ పరిశ్రమలోకి తీసుకుంటాం అని నిర్మాతలు ఆ వైపు పని మొదలుపెట్టారు.

తాజాగా టాలీవుడ్ సమ్మె పై పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవితో మీటింగ్ అయ్యారు. నేడు సాయంత్రం చిరంజీవి ఇంట్లో అల్లు అరవింద్, సుప్రియ, మైత్రి రవి, దిల్ రాజు.. పలువురు గిల్డ్ నిర్మాతలు సమావేశమయ్యారు. వేతనాల పెంపు వివాదం, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయాలను చిరంజీవికి వివరించారు.

Also Read : Anasuya – Rashmi : అనసూయ – రష్మీ మాట్లాడుకోవట్లేదా..? జబర్దస్త్ స్టేజిపై ఏడ్చేసిన రష్మీ.. అనసూయ ఎమోషనల్.. ప్రొమో వైరల్..

ఈ మీటింగ్ అనంతరం నిర్మాత సి కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతలు చిరంజీవి గారిని కలసి సమస్యలు చెప్పాము. షూటింగ్స్ సడెన్ గా ఆపడం కరెక్ట్ కాదు, మీ సమస్యలు చెప్పారు, అటు వైపు కార్మికుల వెర్షన్ ను కూడా తెలుసుకుంటాను, రేపే వాళ్ళతో మాట్లాడతాను అని చిరంజీవి గారు చెప్పినట్టు తెలిపారు. దీంతో ఈ సమస్యకు చిరంజీవి పరిష్కారం చూపిస్తారేమో చూడాలి.

Exit mobile version