Tollywood Producers : ఏషియన్ సునీల్ నారంగ్ పై నిర్మాతల ఫైర్.. అసలు మీకేం తెలుసు.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..

మైత్రి అధినేత రవి, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ ఏషియన్ సునీల్ నారంగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. (Tollywood Producers)

  • Published on- May 13, 2026 / 07:22 PM IST

Tollywood Producers

Tollywood Producers : సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రెంటల్ విధానం ఆపేసి పర్సెంటేజ్ విధానం తేవాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు గత కొన్నాళ్లుగా కోరుతున్నారు. నిర్మాతలు మాత్రం పర్సెంటేజ్ విధానానికి మొగ్గు చూపట్లేదు. ఈ క్రమంలో ఇప్పటికే 22 థియేటర్లు సినిమాలు ఆపేస్తాం అని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ సమస్యకు సంబంధించి త్వరలో ఫిలిం ఛాంబర్ తో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మీటింగ్ ఉంది.

కానీ ఇంతలోనే నిన్న మంగళవారం నాడు కొంతమంది ఎగ్జిబిటర్స్, నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి పర్సెంటేజ్ ఒప్పుకోకపోతే ఈ నెల చివరి నుంచి సినిమాలు ఆపేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్, ఏషియన్ సినిమాస్ నిర్మాత సునీల్ నారంగ్ ఉన్నారు. దీంతో నేడు పర్సెంటేజ్ విధానాన్ని వ్యతిరేకించే నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యారు.

Also Read : Chiranjeevi: ముదురుతున్న ఎగ్జిబిటర్స్‌, ప్రొడ్యూసర్స్ వివాదం.. రంగంలోకి చిరంజీవి.. ‘పెద్ది’కి లైన్ క్లియర్ అయ్యేనా?

ఈ క్రమంలో మైత్రి అధినేత రవి, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ ఏషియన్ సునీల్ నారంగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.

రవి, నాగవంశీ మాట్లాడుతూ.. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ, ఎక్కడ సింగిల్ స్క్రీన్ కనిపిస్తే అక్కడ మల్టిప్లెక్స్ లు కట్టేసి ఆయన నిన్న ప్రెస్ మీట్ లో కూర్చొని సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడటం కామెడీగా ఉంది. వాళ్ళ మల్టిప్లెక్స్ లకు సినిమాలు ఇచ్చుకుంటారు. సింగిల్ స్క్రీన్స్ కి ఇవ్వరు. హైదరాబాద్ మూసాపేట్ లో ఒక థియేటర్ ని మల్టిప్లెక్స్ లా డెవలప్ చేసుకున్నారు. దాని ఎదురుగా ఉండే సింగిల్ స్క్రీన్ ని మాత్రం బాగు చేయనివ్వట్లేదు ఎందుకు.

అన్ని మల్టిప్లెక్స్ లు, అన్ని నగరాల్లో కట్టుకొని డబ్బులు లోపల వేసేసుకొని మీరు సింగిల్ స్క్రీన్స్ సమస్యల గురించి మాట్లాడటం ఏంటి. సింగిల్ స్క్రీన్స్ సమస్యల గురించి మీకేం తెలుసు? జెట్లీ సినిమాకు అలాగే చేసారు. జెట్లీ సినిమాను అయితే సింగిల్ స్క్రీన్స్ తో పాటు వాళ్ళ చేతిలో ఉండే మల్టిప్లెక్స్ లలో కూడా విడుదల చేయలేదు. చెప్పడానికి చాలా ఉన్నాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మల్టిప్లెక్స్ లు కట్టే మీరు సరైన వసతులు లేని సింగిల్ స్క్రీన్స్ ని ఎందుకు బాగు చెయ్యట్లేదు అని ప్రశ్నిస్తూ ఫైర్ అయ్యారు.

Also Read : ఎగ్జిబిటర్లపై నాగవంశీ ఫుల్ ఫైర్.. కావాలంటే చిరంజీవి దగ్గరికెళ్తాం.. వదిలేదే లే..

ఏషియన్ సినిమాస్ ఇటీవల పలువురు హీరోలతో కలిసి మల్టిప్లెక్స్ లు కడుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు తో AMB సినిమాస్, అల్లు అర్జున్ తో AAA సినిమాస్, రవితేజతో ART సినిమాస్, విజయ్ దేవరకొండతో AVD సినిమాస్ కట్టి, మరికొన్ని సింగిల్స్ స్క్రీన్స్ ని మల్టిప్లెక్స్ లుగా మారుస్తున్నారు ఏషియన్ సినిమాస్. అలాంటి మల్టిప్లెక్స్ ల అధినేత నిన్న సింగిల్ స్క్రీన్స్ సమస్యల గురించి మాట్లాడటంపై నేడు టాలీవుడ్ నిర్మాతలు ఫైర్ అయ్యారు. మరి దీనిపై సునీల్ నారంగ్ స్పందిస్తారా లేదా చూడాలి.