September Movies : సెప్టెంబర్ నిండా సినిమాలే.. ఆగస్ట్ హిట్స్ కంటిన్యూ చేస్తాయా..?

సెప్టెంబర్ సినిమాలపై ఆసక్తి నెలకొంది.(September Movies)

  • Published on- September 1, 2026 / 05:54 PM IST

September Movies

September Movies : సంక్రాంతికి ఒకేసారి సినిమాలు వచ్చి సందడి చేసాయి. బిజినెస్ జరిగే సమ్మర్ అంతా ఖాళీగా పెట్టుకున్నారు టాలీవుడ్. కానీ ఆగస్టు నుంచి మాత్రం వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ప్రతివారం ఒక పెద్ద సినిమా, కొన్ని చిన్న సినిమాలు ఉంటున్నాయి. వాటితో పాటు డబ్బింగ్ సినిమాలు తోడవుతున్నాయి. ఆగస్టు లో చాలా సినిమాలు మంచి ఫలితాలు అందుకున్నాయి. కొరియన్ కనకరాజు, ఇరుముడి, విశ్వనాధ్ & సన్స్.. లాంటి సినిమాలు భారీ హిట్స్ కూడా అయ్యాయి. దీంతో సెప్టెంబర్ సినిమాలపై ఆసక్తి నెలకొంది.

సెప్టెంబర్ లో భారీగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొదటి వారం.. సందీప్ రెడ్డి వంగ నిర్మిస్తున్న రోమాంచకం సినిమా సెప్టెంబర్ 3న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అదే రోజు దుల్కర్ సల్మాన్ డబ్బింగ్ సినిమా ఐ యాం గేమ్ రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 4న అల్లరి నరేష్ కామెడిలోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన రంభ ఊర్వశి మేనక సినిమా రిలీజ్ కానుంది. అదే రోజు సహా అనే చిన్న సినిమా రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 4నే హిందీ డబ్బింగ్ సినిమా మీర్జాపూర్, మలయాళం డబ్బింగ్ సినిమా బెత్లహం కుటుంబ యూనిట్ రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు వీటితో పాటు మా రాముడు అందరివాడు, ధర్మస్థల నియోజకవర్గం.. పలు చిన్న సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.

Also Read : Palnati Surya Pratap : మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’.. వెబ్ సిరీస్ తో రాబోతున్న కుమారి 21F దర్శకుడు..

సెప్టెంబర్ రెండవ వారం.. సుహాస్, సూరి కలిసి నటించిన తమిళ్, తెలుగు సినిమా మందాడి సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి. అదే రోజు రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ మారెమ్మ సినిమాతో రాబోతున్నాడు. భారీ అంచనాలు ఉన్న కార్తీ సర్దార్ సీక్వెల్ సినిమా కూడా సెప్టెంబర్ 10నే రాబోతుంది. ఇక బేబీ తర్వాత ఆనంద్, వైష్ణవి కలిసి చేస్తున్న ఎపిక్ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ కానుంది. ఈ సినిమా కంటెంట్ కూడా బాగుందనే వినిపిస్తుంది. అదే రోజు సుమంత్ మహేంద్రగిరి వారాహి అనే సినిమాతో రాబోతున్నాడు. బాలీవుడ్ డబ్బింగ్ సినిమా హైవాన్ కూడా రానుంది.

సెప్టెంబర్ మూడవ వారం.. అనుమాన పక్షి, సీక్రెట్ సోల్జర్ అనే రెండు చిన్న సినిమాలు సెప్టెంబర్ 18న రిలీజ్ కానున్నాయి. దయారా అనే బాలీవుడ్ డబ్బింగ్ సినిమా కూడా రానుంది. ఈ వారం పెద్ద సినిమాలేమి లేవు కాబట్టి మరిన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి.

Also See : Anchor Sreemukhi : గౌనులో యాంకర్ శ్రీముఖి పోజులు..

సెప్టెంబర్ నాలుగవ వారం.. నాని ది పారడైజ్ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 24 రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భర్తీ హైప్ ఉంది. సెప్టెంబర్ 25న బాలీవుడ్ డబ్బింగ్ సినిమా ది వాన్ రిలీజ్ కానుంది.

ఇలా సెప్టెంబర్ నిండా ప్రతివారం సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని చిన్నా చితకా సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. 30 రోజుల గ్యాప్ లోనే దాదాపు 20 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇన్ని సినిమాల్లో ఎన్ని హిట్స్ కొడతాయి? ఆగస్టు సక్సెస్ ని ఏ సినిమాలు కంటిన్యూ చేస్తాయో చూడాలి.