The Paradise collections : బాక్సాఫీస్ వద్ద ది ప్యారడైస్ మూవీ కలెక్షన్ల వర్షం.. రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో నాని మూవీ..
నాని నటించిన ది ప్యారడైజ్ (The Paradise collections ) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Nani The Paradise movie enter into 100 crore club with in two days
The Paradise collections : నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఈ చిత్రం 114 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు చెప్పుకొచ్చింది.
కాగా.. ఈ సినిమా తొలి రోజు 88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే. ఇక నేడు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Priyanka Jain : గుర్రం ఎక్కిన సీరియల్ నటి.. ప్రియాంక జైన్ ఫోటోలు వైరల్..

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. కయాదు లోహర్ కథానాయికగా నటించగా మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, ఈశ్వరీ రావు, సంపూర్ణేశ్ బాబు, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో పోషించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
It is JADAL ZAMANA & we are witnessing its RAMPAGE 🔥🔥#TheParadise collects 114 CRORES+ GROSS WORLDWIDE in 2 days ❤🔥❤🔥
Book your tickets now!
🎟️ https://t.co/XTkG9ueWdvNatural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼… pic.twitter.com/NrSKStQgEP— SLV Cinemas (@SLVCinemasOffl) September 26, 2026
