Tollywood Strike : టాలీవుడ్ లో సమ్మె ఎఫెక్ట్.. చిరు, బాలయ్య, ప్రభాస్ తో సహా ఎవరెవరి షూటింగ్స్ ఆగిపోయాయి అంటే..

టాలీవుడ్ లో ఈ అనధికార సమ్మె ఎఫెక్ట్ చాలా సినిమాల మీదే పడింది.

Tollywood Strike

Tollywood Strike : టాలీవుడ్ లో ప్రస్తుతం సినీ కార్మికులను షూటింగ్స్ కి వెళ్ళొద్దని ఫిలిం ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేయడంతో నిన్నటి నుంచి సమ్మె జరుగుతుంది. ఏకంగా 30 శాతం అదనపు వేతనం ఇచ్చిన వాళ్ళకే పని చేయండి అని ఫెడరేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నిర్మాతలు ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తున్నాం, అంత పెంచలేము అంటూ వాళ్ళు కూడా ఒప్పుకోకపోవడంతో షూటింగ్స్ ఆగిపోయాయి.

దీంతో టాలీవుడ్ లో ఈ అనధికార సమ్మె ఎఫెక్ట్ చాలా సినిమాల మీదే పడింది. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలవ్వాల్సి ఉండగా ఈ సమ్మెతో అది ఆగిపోయింది. దీంతో చిరు, నయనతార డేట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. మరోవైపు అఖండ 2 షూటింగ్ చివరి దశలో ఉండగా ఆ షూటింగ్ కూడా ఆగిపోయిందని తెలుస్తుంది. ఇక ప్రభాస్ రాజాసాబ్ డిసెంబర్ లో రిలీజ్ చేయాలని శరవేగంగా షూట్ చేస్తుండగా ఈ సమ్మెతో ప్రభాస్ సినిమాపై కూడా ఎఫెక్ట్ పడింది.

Also See : Kiara Advani : వార్ 2 సాంగ్ షూట్.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన కియారా అద్వానీ..

విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఈ వారం మొదలవ్వాల్సి ఉంది. సమ్మె జరుగుతుండటంతో ప్రస్తుతానికి ఆ సినిమా షూటింగ్ వాయిదా వేసుకున్నారు. అల్లరి నరేష్ కొత్త సినిమా కూడా నిన్న సోమవారం మొదలవ్వాల్సి ఉండగా ఈ సమ్మెతో వాయిదా వేసుకున్నారు. రామ్ పోతినేని సినిమా రాజమండ్రిలో జరుగుతుండగా అది కూడా ఆగిపోయింది.

నిన్న పవన్ కళ్యాణ్ లాస్ట్ డే షూటింగ్ అని చెన్నై నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొచ్చి షూట్ చేస్తే పలువురు ఫెడరేషన్ నాయకులు వచ్చి స్టూడియో బయట గొడవ చేసారు. కానీ మొత్తానికి ఎలాగో షూటింగ్ అయితే పూర్తయింది.

Also Read : Ram Lakshman : మహేష్ బాబు చిన్నప్పుడు ఆ విషయం నాన్నకు చెప్పొద్దు అన్నాడు.. అప్పుడే మేము అతనితో..

నాని ప్యారడైజ్, సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటి గట్టు, సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా, అడివి శేష్ డెకాయిట్, తేజ సజ్జ మిరాయ్ సినిమాలు కూడా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇవే కాకుండా ఇంకా చాలా చిన్న సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు కూడా ఈ సమ్మెతో ఎఫెక్ట్ అయ్యాయి. మరి సమ్మె ఎప్పుడు విరమిస్తారో, షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి చూడాలి.