Ram Lakshman : మహేష్ బాబు చిన్నప్పుడు ఆ విషయం నాన్నకు చెప్పొద్దు అన్నాడు.. అప్పుడే మేము అతనితో..
తాజాగా రామ్ లక్ష్మణ్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Ram Lakshman
Ram Lakshman : టాలీవుడ్ స్టార్ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ స్టార్ హీరోలందరితో పనిచేసారు. సినీ పరిశ్రమలోకి ఫైటర్స్ గా వచ్చి అనంతరం స్టార్ ఫైట్ మాస్టర్స్ గా ఎదిగారు. తాజాగా రామ్ లక్ష్మణ్ 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఈ క్రమంలో మహేష్ బాబు ప్రస్తావన రాగా మహేష్ చిన్నప్పటి సంఘటన ఒకటి తెలియచేసారు.
Also Read : Urvashi : నేషనల్ అవార్డులను ప్రశ్నించిన నటి.. షారుఖ్ కి ఎలా ఇస్తారు? అతనికి ఎందుకు ఇవ్వలేదు?
రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. మేము ఫైటర్స్ గా ఉన్నప్పుడు మహేష్ బాబు చిన్నప్పుడు చేసిన ఒక సినిమాలో అతనితో ఫైట్ చేసాము. మహేష్ చిన్నప్పుడు ఫైట్ సీన్ చేసినప్పుడు మేము ఫైటర్స్. ఆ సినిమాకు సత్యరాజ్ గారు ఫైట్ మాస్టర్. మహేష్ బాబు సత్యరాజ్ గారి దగ్గరకు వచ్చి.. మా నాన్నకు చెప్పొద్దు, నేను డూప్ లేకుండా చేస్తాను అన్నారు. అలా చిన్నప్పుడే డూప్ లేకుండా ఫైట్స్ చేసారు. మేము కూడా కృష్ణ గారికి ఈ విషయం చెప్పలేదు. తర్వాత మేము ఫైట్ మాస్టర్స్ అయ్యాక మహేష్ తో చాలా సినిమాలు చేసాము అని తెలిపారు.
Also Read : Kantara 3 : కాంతార-3లో ఎన్టీఆర్..?