Kantara 3 : కాంతార-3లో ఎన్టీఆర్..?
అప్పుడే కాంతార-3పై న్యూస్ వైరల్ అవుతోంది.

Jr NTR in Rishab Shetty Kantara 3
కంటెంట్ బాగుంటే సినిమా హిట్. కథలో పస లేకపోతే ఎంత ప్రచారం చేసినా సక్సెస్ కొట్టడం కష్టమే. 2022లో వచ్చిన కాంతార మూవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ సినిమా రిషబ్‌శెట్టి డైరెక్ట్ చేయడంతో పాటు మూవీలో కీరోల్ ప్లే చేశాడు. ఇప్పుడు పార్ట్ కూడా తీస్తున్నారు. అప్పుడే కాంతార-3పై న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ సీక్వెల్‌లో రిషబ్ శెట్టితో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే, ఇది కచ్చితంగా పాన్-ఇండియా స్థాయి మూవీ అవడం పక్కా.
Ustaad Bhagat singh : పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి సూపర్ అప్‌డేట్..
https://youtu.be/YbxbD95LUo0?si=PI5nmeGNNKzgavgb
గతంలో జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి షాలిని నందమూరితో కలిసి బెంగళూరు వెళ్లినప్పుడు, రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. ఈ సందర్భంలోనే రిషబ్, ఎన్టీఆర్‌తో కాంతార-3 కథపై డిస్కస్ చేశాడని అంటున్నారు. ఎన్టీఆర్‌కు స్టోరీ బాగా నచ్చి, ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ఎన్టీఆర్ తల్లి కర్నాటకలోని కుందాపూర్‌కు చెందినవారు కావడం, కాంతారలో చూపించిన కోలా రిచ్యువల్స్‌తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండటం కూడా ఈ కాంబినేషన్‌కు బలం చేకూర్చినట్లు సమాచారం.
ఈ బాండింగ్‌తో ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంతార-3లో ఎన్టీఆర్ పాత్ర గురించి ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. రిషబ్ శెట్టి రూపొందించే ఈ సీక్వెల్‌లో ఎన్టీఆర్ కేవలం కామియో కాకుండా, కథలో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్. ఇది నిజమైతే కాంతార-3 బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమన్న అంచనాలున్నాయి.