Ustaad Bhagat singh : పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి సూపర్ అప్‌డేట్..
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు.

Successfully wrapped the schedule of Ustaad Bhagat Singh
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను కమిటైన సినిమా షూటింగ్‌లను శర వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా.. ఓజీ చిత్ర షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తున్నారు. గత కొద్ది రోజులు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్టు పూరైంది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పవన్‌తో దిగిన ఫోటోను పోస్టు చేస్తూ.. “మాటిస్తే.. నిలబెట్టుకోడం, మాట మీదే.. నిలబడ్డం, మీరు పక్కనుంటే..కరెంటు పాకినట్టే.” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
హరీశ్ పోస్టు చేసిన ఫోటోలో పవన్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో రాశిఖన్నా, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.