Urvashi : నేషనల్ అవార్డులను ప్రశ్నించిన నటి.. షారుఖ్ కి ఎలా ఇస్తారు? అతనికి ఎందుకు ఇవ్వలేదు?
తాజాగా ఊర్వశి తనకు ప్రకటించిన అవార్డుతో పాటు, షారుఖ్ కి ప్రకటించిన బెస్ట్ యాక్టర్ అవార్డు, పూక్కళమ్ సినిమాకు విజయరాఘవన్ కి వచ్చిన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులను ప్రశ్నిస్తుంది.

Urvashi
Urvashi : ఇటీవల 71వ నేషనల్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పలువురు ఈ అవార్డులపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో నటి ఊర్వశికి ఉళ్ళోజుక్కు అనే మలయాళం సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ప్రకటించారు. తాజాగా ఊర్వశి తనకు ప్రకటించిన అవార్డుతో పాటు, షారుఖ్ కి ప్రకటించిన బెస్ట్ యాక్టర్ అవార్డు, పూక్కళమ్ సినిమాకు విజయరాఘవన్ కి వచ్చిన బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులను ప్రశ్నిస్తుంది.
ఊర్వశి మలయాళంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. అసలు నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ఎలా ఇచ్చారు? జ్యూరీ నటనను ఏ పద్దతిలో కొలిచారు? సపోర్టింగ్ అనే కేటగిరిలో ఎలా ఇచ్చారు? మీరు ఇవ్వగానే తీసుకోడానికి అదేమీ పెన్షన్ కాదు అంటూ ప్రశ్నించింది.
Also Read : Kantara 3 : కాంతార-3లో ఎన్టీఆర్..?
అలాగే ఊర్వశి.. షారుఖ్ ఖాన్ కి బెస్ట్ యాక్టర్ ఎలా ఇచ్చారు? అసలు ఏ పద్ధతిన షారుఖ్ కి బెస్ట్ యాక్టర్ ఇచ్చారు? పూక్కళమ్ సినిమాకు విజయ రాఘవన్ కి సపోర్టింగ్ కేటగిరిలో ఎలా ఇచ్చారు? అతనికి బెస్ట్ యాక్టర్ ఇవ్వాలి కదా. ఆ సినిమాలో ఛాన్స్ నాకు కూడా వచ్చింది. అందులో పాత్ర నాకు కష్టం అనిపించి చేయలేదు. ఆయన కష్టమైనా పాత్ర చేసాడు. అది పెద్ద సినిమా, 250 కోట్ల సినిమా కాదు, అంత పెద్ద హిట్ అవ్వలేదు అని చూసారా? అసలు ఈ అవార్డులను జ్యూరీ ఎలా బేరీజు చేసి ఇచ్చింది అని ప్రశ్నించింది.
షారుఖ్ విషయంలో మాత్రం గతంలో ఎన్నో మంచి సినిమాలు, మంచి యాక్టింగ్ పాత్రలు చేసిన వాటికి రాకుండా జవాన్ కి రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఊర్వశి బెస్ట్ ఇవ్వకుండా బెస్ట్ సపోర్టింగ్ ఎలా ఇస్హారు అని చేసిన కామెంట్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు మూవీ యూనిట్ ఏ కేటగిరిలో అప్లై చేస్తే వాళ్ళు ఆ కేటగిరీలోనే చూస్తారు కదా, మూవీ యూనిట్ బెస్ట్ కేటగిరిలోనే అప్లై చేసారా? సపోర్టింగ్ కేటగిరిలో ఇచ్చారా? మీ మూవీ యూనిట్ ని అడిగారా? సపోర్టింగ్ పాత్ర చేసి మెయిన్ లీడ్స్ లో ఎలా అడుగుతారు అని ఆమెని ప్రశ్నిస్తున్నారు. మరి ఊర్వశి ఆ అవార్డు తీసుకోడానికి వెళ్తుందా లేదా చూడాలి.
Also Read : Ustaad Bhagat singh : పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి సూపర్ అప్‌డేట్..