Tollywood Strike
Tollywood Strike : ప్రస్తుతం టాలీవుడ్ లో ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే. వేతనాలు ఏకంగా 30 శాతం పెంచాలంటూ లేకపోతే షూటింగ్స్ కి రాము అంటూ సమ్మె చేస్తున్నారు. అటు నిర్మాతలు ఇప్పుడు టాలీవుడ్ ఉన్న పరిస్థితుల్లో పెంచలేమంటూ కావాలంటే 5 శాతం, కొంతమందికి 15 శాతం పెంచుతామని చెప్పినా ఫిలిం ఫెడరేషన్ ఒప్పుకోలేదు.
Also Read : Mahesh Babu : పవన్ లాగే మహేష్.. SSMB29 పోస్టర్.. మహేష్ మెడలో ఉన్న లాకెట్ ఏంటి..? శివుడి బ్యాక్ డ్రాప్ లో..
తాజాగా ఫిలిం ఫెడరేషన్ కార్మికులతో కలిసి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అంటున్నారు. నేడు సాయంత్రం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ లో దీనిపై మీటింగ్ జరగనుంది. రేపు ఆదివారం కృష్ణా నగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర చేసి అక్కడ ధర్నా చేయనున్నారు. అలాగే నేడు మంత్రి కోమటిరెడ్డితో కూడా ఫిలిం ఫెడరేషన్ నాయకులు మీటింగ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది.