Suma Kanakala : యాంకర్ సుమకు సన్మానం.. టాలీవుడ్ అంతా కలిసి..? లీక్ చేసేసిన నిర్మాత..

అందరికి ఎంతో దగ్గరయిన సుమకు టాలీవుడ్ అంతా కలిసి సన్మానం చేయాలని చూస్తుందట.

Tollywood wants to Felicitate to Anchor Suma Kanakala

Suma Kanakala : యాంకర్ సుమ కనకాల అంటే తెలియని తెలుగువారు ఉండరు. టీవీ షోలతో తెలుగు ప్రజలకు, ఫ్యామిలీలకు బాగా దగ్గరయ్యారు. సుమ లేకపోతే ఏ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగదు. అందరూ హీరోల డేట్స్ కోసం ఎదురుచూస్తుంటే హీరోలు మాత్రం తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఈ విషయం స్వయంగా చిరంజీవి, ఎన్టీఆర్.. లాంటి చాలా మంది స్టార్స్ సినిమా ఈవెంట్స్ స్టేజీలపై చెప్పారు.

సుమ అంటే తెలుగు ప్రేక్షకులకు, అందరి హీరోల ఫ్యాన్స్ కు, సినిమా ఇండస్ట్రీలో అందరికి ఇష్టమే. సుమ కూడా అందరితో మంచిగా ఉంటూ అందరితో కలిసిపోతూ ఉంటుంది. ప్రస్తుతం సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, యూట్యూబ్ ఛానల్, అప్పుడప్పుడు నటిగా చేస్తూ బిజీగానే ఉంది. 50 ఏళ్ళు వచ్చినా ఇంకా యువతిలా చలాకీగా ఉంటూ తన యాంకరింగ్ తో, మాటలతో అందర్నీ అలరిస్తుంది. సినిమా ఈవెంట్స్ లో ఎలాంటి అనుకోని సంఘటనలు ఎదురైనా తన చాతుర్యంతో చాకచక్యంగా డీల్ చేస్తుంది.

Also Read : Ananthika Sanilkumar : చీరకట్టులో అనంతిక.. ఎంత క్యూట్ గా ఉందో.. 8 వసంతాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..

అయితే టాలీవుడ్ లో అందరికి ఎంతో దగ్గరయిన సుమకు టాలీవుడ్ అంతా కలిసి సన్మానం చేయాలని చూస్తుందట. ఇటీవల ఓ ఈవెంట్లో యాంకరింగ్ లో ఏదన్నా పెద్ద అవార్డు ఉంటే అది సుమకి ఇవ్వాలని అన్నారు. తాజాగా 8 వసంతాలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ ని కూడా సుమనే హోస్ట్ చేసింది. ఈ ఈవెంట్లో మైత్రి నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ అంతా కలిసి సుమ గారికి ఒక పెద్ద సన్మానం చేద్దామని అనుకుంటున్నాము అని అన్నారు. దీంతో సుమ దాన్ని సరదాగా తీసుకొని.. ఇప్పుడే వద్దు సర్, ఒక 20 ఏళ్ళ తర్వాత చేయండి అని సరదాగా అన్నారు.

అయితే టాలీవుడ్ నిజంగానే సుమకు ఘనంగా సన్మానం చేయాలని, ఏదైనా పెద్ద అవార్డు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇండస్ట్రీలో అందరికి ఇష్టమైన సుమకు ఇండస్ట్రీ అంతా కలిసి సన్మానం ఎప్పుడు చేస్తారో చూడాలి. ఒకవేళ అది జరిగితే పరిశ్రమలో అందరికి సుమతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది కాబట్టి సినిమా స్టార్స్ అంతా కచ్చితంగా హాజరవుతారు అనే తెలుస్తుంది.

Also Read : Jabardasth Varsha : లైఫ్ లో పెళ్లి చేసుకోను.. క్లారిటీ ఇచ్చేసిన జబర్దస్త్ వర్ష.. పెళ్లి, ప్రేమపై మాట్లాడుతూ..