Tollywood young hero Teja Sajja next two movie Updates
Teja Sajja: టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు బ్యాక్ టూ బ్యాక్ వంద కోట్ల సినిమాలు చేశాడు యంగ్ హీరో తేజ సజ్జా. ఈ హీరో దర్శకుడు ప్రశాంత్ వర్మతో చేసిన హనుమాన్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ హీరో అండ్ డివోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఏకంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో మిరాయ్ సినిమా చేశాడు ఈ హీరో. యాక్షన్ అడ్వెంచర్ అండ్ డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
Naga Babu: అది అసలు తప్పే కాదు.. శివాజీ కామెంట్స్ పై నాగబాబు సీరియస్
పక్కా కంటెంట్ తో ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో తేజ సజ్జా చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. కానీ, మిరాయ్ తరువాత సైలెంట్ అయ్యాడు తేజ సజ్జా(Teja Sajja). ఇప్పటివరకు నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే తేజ సజ్జా నెక్స్ట్ రెండు సినిమాల గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదులో ఒకరి జాంబీ రెడ్డి 2. 2021లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు మేకర్స్. పపాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
ఇక ఈ సినిమా తరువాత మిరాయ్ సీక్వెల్ చేయనున్నాడు తేజ సజ్జా. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఇప్పటికే ఈ సీక్వెల్ పై వర్క్ మొదలుపెట్టేశాడు. కథ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయ్యింది అని సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా రానుంది అని సమాచారం. ఇలా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన రెండు సినిమాలకు సీక్వెల్స్ చేసే పనిలో ఉన్నాడు తేజ సజ్జా. అందుకే, ప్రస్తుతం కాస్త సైలెంట్ అయ్యాడు. ఇవన్నీ చూస్తుంటే ఇది వైలెన్స్ ముందు వచ్చే సైలెన్స్ లాగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.