Naga Babu: అది అసలు తప్పే కాదు.. శివాజీ కామెంట్స్ పై నాగబాబు సీరియస్

టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్స్ వస్త్రధారణ గురించి వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయంపై నాగబాబు(Naga Babu) స్పందించాడు. ఈమేరకు ఒక వీడియో కూడా విడుదల చేశాడు.

Naga Babu: అది అసలు తప్పే కాదు.. శివాజీ కామెంట్స్ పై నాగబాబు సీరియస్

Nagababu responded to actor Shivaji's comments.

Updated On : December 27, 2025 / 12:05 PM IST

Naga Babu: టాలీవుడ్ నటుడు శివాజీ హీరోయిన్స్ వస్త్రధారణ గురించి వివాదాస్పద కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు స్పందిస్తూ తమ ఒపీనియన్ ని చెప్తున్నారు. అందులో కొంతమంది శివాజీకి సపోర్ట్ గా నిలిస్తుంటే.. మరికొందరేమో మహిళలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. తాజాగా ఈ ఇష్యుపై నాగబాబు(Naga Babu) స్పందించాడు. ఈమేరకు ఒక వీడియో కూడా విడుదల చేశాడు.

Shiva Jyothi: బిగ్ బాస్ ఫేమ్ శివ జ్యోతి బేబీ షవర్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “నేను ఒక సామాన్య వ్యక్తిగా ఈ విషయంపై స్పందిస్తున్నాను. ఇక్కడ నేను ఎవరికీ సపోర్ట్ కాదు.. వ్యతిరేకం అంతకన్నా కాదు. నా మాటలు మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. మన ఆడవాళ్లు, మహిళలు ఎలా ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏం మాట్లాడాలి అనే విషయాలపై ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అది రాజ్యాంగం ప్రకారం తప్పు. ఆడవాళ్లు ఇలాంటి డ్రెస్‌లే వేసుకోవాలని చెప్పే హక్కు మనకు హక్కు లేదు. ప్రతి ఆడపిల్లకి ఆత్మగౌరవం అనేది ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్‌ అనేక రకాలుగా మారుతూ వస్తోంది. ప్రతి ఆడపిల్లను మన కుటుంబసభ్యురాలిగా చూడండి. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు కూడా ఉంది.

ఆడపిల్లలు మీరు ఎలాంటి బట్టలైనా వేసుకోండి. కానీ, మీ రక్షణ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. నేను మగవాళ్లని తప్పుపట్టడం లేదు. కొంతమంది గురించి మాత్రమే చెప్తున్నాను. మహిళలను అవమానించిన వారు బాగు పడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. వాళ్ళకి నాలాంటి అండగా ఉంటారు. ఇలాంటి అంశంపై స్పందించడం అనేది ప్రతిఒక్కరి బాధ్యత’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. దీంతో, నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.