కత్రినా కైఫ్ దశాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా స్టార్. ఆమె తర్వాత దీపికా పదుకొనే, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్ ఉన్నారు.
బాలీవుడ్ బాక్సాఫీస్ వ్యాపారం (నెట్ దేశీయ) 2010 నుండి 2019 వరకు రెట్టింపు కంటే ఎక్కువైంది. సుమారు రూ. 1,700 కోట్ల నుండి రూ. 4,000 కోట్లకు పెరిగింది. ముంబైకి చెందిన మీడియా కన్సల్టింగ్ సంస్థ, ఓర్మాక్స్ మీడియా తెలిపిన బాక్సాఫీస్ లెక్కల ప్రకారం కత్రినా కైఫ్ దశాబ్దంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా స్టార్. ఆమె తర్వాత దీపికా పదుకొనే, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్ ఉన్నారు. పెరుగుతున్న మహిళా స్టార్ జాబితాలో అలియా తరువాత దీపిక, కంగనా రనౌత్ ఉన్నారు.
కత్రినా కైఫ్ నటించిన భారత్ (2019), జీరో (2018), టైగర్ జిందా హై (2017), బ్యాంగ్ బ్యాంగ్ (2014) సూపర్ హిట్ అయ్యాయి. దీపికా పదుకొణే నటించిన పద్మావతి (2018), xxx : return of xander cage(2017), బాజీరావు మస్తానీ (2015), చెన్నై ఎక్స్ ప్రెస్ (2013) సినిమాలు బాగా ఆడాయి. కరీనా కపూర్ నటించిన Good Newwz (2018), Veere Di Wedding (2018), Bajrangi Bhaijan (2015), Heroine (2012) సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.
ప్రియాంక చోప్రా…The Sky is Pink (2019), Dil Dhadakne Do (2015), Mary Com (2014), Barfi! (2012) సినిమాలో నటించింది. అలియా భట్….కలంక్ (2019), గల్లీ బాయ్ (2019), రాజీ (2018), డియర్ జిందగీ (2016) చిత్రాల్లో నటించింది.అనుష్క శర్మ.. ప్యారీ (2018), జబ్ హరీ మెత్ సేజాల్ (2017), ఫిల్లౌరీ (2017), దిల్ ధడక్నే (2015) సినిమాల్లో నటించారు. సోనాక్షి సిన్హా..దంబాంగ్ 3 (2019), మిషన్ మంగళ్ (2019), కలంక్ (2019), రౌడీ రాథోర్ (2012)..,
శ్రద్ధా కపూర్…సాహో (2019), హాఫ్ గర్ల్ ఫ్రెండ్ (2017), ఒకే జాను (2017), హైదర్ (2014) వంటి పలు చిత్రాల్లో నటించారు. జాక్విలిన్ ఫెర్నాండెజ్…డ్రైవ్ (2019), రేస్ 3 (2018), జుద్వా2 (2017), హౌస్ ఫుల్ 3 (2016), విద్యా బాలన్…మిషన్ మంగళ్ (2019), తుమ్హారీ సూలు (2017), బేగమ్ జాన్ (2017), కహానీ 2 (2016) నటించారు.