తెలుగు సినిమా 2019: టీఆర్‌పీల్లో టాప్ సినిమాలు ఇవే!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్లుగా మారిపోయింది. బాహుబలికి ముందు శాటిలైట్ రైట్స్ అంటే పెద్దగా ఎవరికి తెలిసేవి కాదు. ఏదో అమ్మామంటే అమ్మాం అన్నట్లుగా ఓ డిస్ట్రిబ్యూటర్‌కి అమ్మినట్లుగా సినిమాని అమ్మేవాళ్లు కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమాల శాటిలైట్ హక్కులు భారీ రేట్లకు అమ్మడుపోతున్నాయి.
ఈ క్రమంలోనే 2019లో సినిమాలను భారీ రేట్లకు అమ్ముకున్నారు నిర్మాతలు అలా 2019 సంవత్సరంలో అమ్ముకున్న సినిమాలు.. బుల్లితెర ప్రేక్షకులనూ అలరించాయి. 2019 సంవత్సరానికి టాప్ టీఆర్‌పీ రేటింగ్‌లు సాధించిన సినిమాల లిస్ట్ చూస్తే..
F2(Fun & Frustration) ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలై థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను బుల్లి తెరపై కూడా అలరించారు ప్రేక్షకులు ఈ సినిమాకు 17.2 టీఆర్‌పీ రేటింగ్ రాగా.. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నీరాజనం పలికారు బుల్లితెర ప్రేక్షకులు.
ఇక రెండో స్థానంలో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి ఇస్మార్ట్ హిట్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ నిలిచింది. ఈ సినిమాకు 16.63 టీఆర్‌పీ రేటింగ్ లభించింది. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మూడో స్థానంలో ‘కాంచన 3’ నిలిచింది. ముని సినిమా సీక్వెల్‌గా రాఘవ లారెన్స్ చేసిన ఈ సినిమాకు 13.10 టీఆర్‌పీ రేటింగ్ లభించింది.
తర్వాతి స్థానాల్లో వరుసగా.. మహేష్ బాబు- మహర్షి (9.2), సమంత- ఓ బేబీ (9), నాని- జెర్సీ (8.8), నాగచైతన్య- మజిలీ (7.9), రాంచరణ్- వినయ విధేయ రామ (7.90), కాజల్- సీత (7.53), కళ్యాణ్ రామ్- 118 మూవీ (6.33) టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చాయి.