Top 10 Web Series are coming back with season 3
Top 10 Web Series : లాక్ డౌన్ తరువాత వెబ్ సిరీస్ కల్చర్ ఆడియన్స్ కి బాగా అలవాటు అయ్యిపోయింది. దీంతో స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత, నాగ చైతన్య, వెంకటేష్, రానా వంటి స్టార్స్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పటికే పలు వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుగా నిలిచాయి. తాజాగా సీజన్ 3 తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి.
Manchu Vishnu Vs Manoj : మా అబ్బాయిల మధ్య ఎలాంటి గొడవలు లేవు.. మోహన్ బాబు భార్య!
ప్రస్తుతం ఇండియాలో సూపర్ హిట్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది రాజ్ & డీకే కాంబినేషన్. వీరిద్దరూ కలిసి డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సూపర్ హిట్టుగా నిలవగా, తాజాగా ‘ఫర్జి’తో కూడా సక్సెస్ ని అందుకున్నారు. ప్రస్తుతం సమంతతో సిటాడెల్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. ఫస్ట్ రెండు సీజన్ లు పాకిస్తాన్ అండ్ శ్రీలంక నేపథ్యంతో ఉంటే, ఈసారి చైనా నేపథ్యంతో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
Manchu Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మోహన్ బాబు.. నాకేం తెలియదంటున్న మంచు లక్ష్మి!
ఇక దేశవ్యాప్తంగా ఉన్న మాస్ ఆడియన్స్ అందర్నీ అలరించిన సిరీస్ ‘మీర్జాపూర్’. ఎక్కువ అడల్ట్ అండ్ వైలెన్స్ కంటెంట్ తో వచ్చిన ఈ సిరీస్ లో గుడ్డు అండ్ మున్నాభాయ్ పాత్రలు ప్రతి ఒకర్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్ కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సీజన్ త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ఇక ఈ సిరీస్ తో పాటే సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇదే..
The Family Man
Mirzapur
Panchayat
Arya
Delhi Crime
Mismatched
Apharan
Kota Factory
SHE
Fabulous Lives of Bollywood Wives