Manchu Vishnu Vs Manoj : అన్నదమ్ముల గొడవ పై స్పందించిన మోహన్ బాబు.. నాకేం తెలియదంటున్న మంచు లక్ష్మి!
ఈరోజు ఉదయం మంచు మనోజ్ (Manchu Manoj) పై మంచు విష్ణు (Manchu Vishnu) దాడి చేస్తున్న వీడియో ఒకటి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. దీని పై మోహన్ బాబు (Mohan Babu) స్పందించి.. ఆ వీడియోని డిలీట్ చేయించాడు.

mohan babu and manchu lakshmi reacted on Vishnu vs Manoj
Manchu Vishnu Vs Manoj : సెలబ్రేటిస్ ఇళ్లల్లో చిన్న విషయం జరిగినా అది వైరల్ అవ్వాల్సిందే. అలాంటిది ఏకంగా దూషించుకొని, కొట్టుకునే పరిస్థితులు వరకు వెళ్లిందంటే అది సంచలన వార్త కావాల్సిందే. టాలీవుడ్ లో స్టార్ ఫ్యామిలీ మంచు కంపౌండ్ లో ఈరోజు పెద్ద కలకలం రేగింది. మంచు బ్రదర్స్ మనోజ్ (Manchu Manoj) అండ్ విష్ణుకి (Manchu Vishnu) గత కొన్నాళ్లుగా మాటలు లేవని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన మనోజ్ పెళ్లి కూడా విష్ణు రాకపోవడం, మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో కూడా వీరిద్దరూ మాట్లాడుకోకపోవడం వంటి సంఘటనలు ఆ వార్తలు నిజమనేలా చేశాయి.
తాజాగా మంచు మనోజ్, విష్ణు గొడవకి సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. మనోజ్ అనుచరుడు సారథి ఇంటికి మంచు విష్ణు వెళ్లి అతనిపై దాడి చేస్తున్న దృశ్యాన్ని మనోజ్ వీడియో తీసి తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్దీ సమయంలోనే ఆ వీడియో వైరల్ అవ్వడంతో, మీడియాలో కూడా హాట్ టాపిక్ అవ్వడంతో మోహన్ బాబు (Mohan Babu) రియాక్ట్ అయ్యాడు. చిన్న సమస్యని పెద్దది చేయకండి. ఇంటి గొడవ రచ్చకెక్కుతుంది అంటూ మనోజ్ చేత ఆ వీడియోని మోహన్ బాబు డిలీట్ చేయించాడు.
Manoj-Mounika : పెళ్లి తరువాత భార్య పై మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్.. కన్నీరు పెట్టుకున్న మౌనిక..
ఇక ఈ విషయం పై మంచు లక్ష్మిని (Manchu Lakshmi) ప్రశ్నించగా.. నాకు అసలు ఈ గొడవ గురించే తెలియదు. ఈ రోజు మా ఇంట్లో లంచ్ ప్రోగ్రాం ఉంది. నేను బిజీగా ఉన్నాను. దాని గురించి తెలియకుండా మాట్లాడను అని బదులిచ్చింది. అయితే ఈ విబేధాలకు గల కారణం ఏంటనేది తెలియలేదు. కాగా కొంత కాలంగా మనోజ్ అనుచరుల పై విష్ణు ఏదో విధంగా గొడవకి దిగుతున్నట్లు తెలుస్తుంది. మనోజ్, మౌనికని చేసుకోవడం ఇష్టం లేదని, అందుకే మనోజ్ పెళ్ళికి కూడా రాలేదని తెలుస్తుంది.