Manoj-Mounika : పెళ్లి తరువాత భార్య పై మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్.. కన్నీరు పెట్టుకున్న మౌనిక..

మంచు మనోజ్(Manchu Manoj) మార్చి 3న భూమా మౌనికని(Bhuma Mounika) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం ఎక్కడా తన భార్య మౌనిక గురించి మనోజ్ పెద్దగా మాట్లాడలేదు. తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకల్లో..

Manoj-Mounika : పెళ్లి తరువాత భార్య పై మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్స్.. కన్నీరు పెట్టుకున్న మౌనిక..

Manchu Manoj make his wife Bhuma Mounika emotional

Manoj-Mounika : మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనికని(Bhuma Mounika) ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ అండ్ మౌనిక గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. వాటిని నిజం చేస్తూ మార్చి 3న హైదరాబాద్ లోని మనోజ్ ఇంట్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇది రెండో వివాహం. దీంతో పెద్ద హడావుడి లేకుండా కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు, తిరుపతి దేవస్థానానికి వెళ్లినా.. ఎక్కడా తన భార్య మౌనిక గురించి మనోజ్ పెద్దగా మాట్లాడలేదు.

Manchu Manoj Marriage : అప్పుడు భూమా పెళ్లికి అతిధిగా.. ఇప్పుడు వరుడిగా.. ఫోటో వైరల్!

తాజాగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకలను తిరుపతిలో నిర్వహించగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు అందరూ విచ్చేశారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కూడా తన భార్య మౌనికతో కలిసి ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మనోజ్ మాట్లాడుతూ.. జీవితంలో ఒక టైం వస్తుంది. ఆ సమయంలో మొత్తం చీకటి అయ్యిపోయినట్లు అనిపిస్తుంది. ఆ చీకటికి బయపడి అక్కడే ఆగిపోతే, జీవితంలో ఎప్పటికి వెలుతురూ కనిపించదు. కానీ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళితేనే ఒక వెలుగు కనిపిస్తుంది.

Manoj-Mounika : పెళ్లి తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన మంచు మనోజ్ – భూమా మౌనిక

అలా నా జీవితంలో కనిపించిన వెలుగే నా భార్య మౌనిక. తను ఎదురయ్యేకే నాకు అర్థమైంది. నన్ను ఎంతో ప్రేమించిన మీ అభిమానాన్ని దూరం చేసుకున్నానని. అందుకనే మళ్ళీ సినిమాలు మొదలు పెట్టాను. అలాగే నేను ప్రేమించిన మౌనిక కూడా స్వేచ్ఛగా ఉండాలి. తను కూడా తన డ్రీం కోసం పోరాడే అవకాశం నేను కల్పించాలి. ప్రతి మగవాడి సక్సెస్ వెనుక ఒక ఏడాది ఉంటది అని ఎలా చెబుతారో, అలాగే ఒక ఆడ దాని సక్సెస్ వెనుక కూడా ఒక మొగాడు ఉండాలి.

ఆడది గెలిస్తేనే మనం గెలిచినట్లు. కవులు ప్రేమ జంటని ప్రేమ పావురాలు, ప్రేమ పక్షులు అని వర్ణిస్తారు. ఎందుకంటే, ఆ పక్షి ఎంత స్వేచ్ఛగా అయితే ఎగిరిదో, మనం కూడా మనం ప్రేమించే వ్యక్తిని అంటే స్వేచ్ఛగా ఎగరానివ్వాలి అంటూ ఎమోషనల్ కామెట్స్ చేశాడు. దీంతో ఆ కార్యక్రమంలో ఉన్న మౌనిక ఎమోషనల్ అయ్యి అందరి ముందు కన్నీరు పెట్టుకుంది.