Tovino Thomas: రాజమౌళి ‘వారణాసి’లో రావణుడిగా టోవినో థామస్.. మలయాళ స్టార్ క్రేజీ కామెంట్స్
Tovino Thomas in Varanasi Movie: రాజమౌళి చేస్తున్న వారణాసి సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన మలయాళ స్టార్ టోవినో థామస్(Tovino Thomas).
- V Santhosh Kumar
- Updated on- April 17, 2026 / 02:22 PM IST
Tovino Thomas as Ravana in Rajamouli Varanasi movie
- రాజమౌళి పిలిస్తే రావణుడిగా మారడానికైనా రెడీ
- ఆయన సినిమాలో చేయడం ఏ నటుడికైనా ఒక కల
- టోవినో థామస్ ఓపెన్ స్టేట్‌మెంట్
Tovino Thomas: సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే సినీ ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ కాన్వాస్‌లో భాగం కావాలని దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో నటీనటులు ఆసక్తి చూపిస్తున్నారు.
* సినిమా వల్ల నా తల్లిదండ్రుల కర్మకాండలు చేయలేకపోయాను.. తిరువీర్ ఎమోషనల్ కామెంట్స్
అందులో భాగంగానే, మలయాళ స్టార్ హీరో టోవినో థామస్(Tovino Thomas) తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఏ నటుడికైనా ఒక కల అని, ఒకవేళ ఆయన ‘వారణాసి’ చిత్రంలో తనకు రావణుడి పాత్రను ఆఫర్ చేస్తే కళ్లు మూసుకుని చేస్తానని స్పష్టం చేశారు. రావణుడి వంటి శక్తివంతమైన, కఠినమైన పాత్రను రాజమౌళి విజన్‌లో పోషించడం ఒక అద్భుతమైన అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పాత్ర కోసం తాను ఎంతటి శ్రమకైనా సిద్ధమని తన ఉత్సాహాన్ని చాటుకున్నారు.
నిజానికి, రాజమౌళి చిత్రాల్లోని విలన్ పాత్రలు హీరోలకు సమానమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయని. అందుకే టోవినో వంటి నటుడు అటువంటి నెగటివ్ రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టోవినో థామస్ గతంలో ‘మిన్నల్ మురళి’ వంటి చిత్రాలతో తన నటనానైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. ఒకవేళ రాజమౌళి రూపొందించే ‘వారణాసి’లో టోవినో వంటి స్టార్ రావణుడిగా కనిపిస్తే, అది వెండితెరపై ఒక విజువల్ వండర్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి టోవినో చేసిన ఈ కామెంట్స్ పై రాజమౌళి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
