ట్రాన్స్‌జెండర్ సింగర్లతో రజనీకాంత్ ‘దర్బార్’

దక్షిణాది సినిమా ఇండస్ట్రీ ఆశగా ఎదురుచూస్తున్న సినిమాలలో దర్బార్ ఒకటి. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ లో పోలీస్‌గా నటిస్తూ సంక్రాంతి నాటికి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న సినిమా యూనిట్ టెక్నికల్ పనులపై దృష్టి పెట్టింది. 

పాటల రికార్డింగ్‌లో భాగంగా ఓ సాంగ్‌ను హిజ్రాలతో పాడించారు. ముందుగా వేరే వాళ్లతో పాడించాలని అనుకుని తర్వాత నిర్ణయం మార్చుకున్నారు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. అందుకోసమే సంగీతంలో శిక్షణ తీసుకున్న హైదరాబాద్‌ ట్రాన్స్‌జెండర్లు చంద్రముఖి, రచనా ముద్రబోయిన, ప్రియలను పిలిపించారు. 

రజనీకాంత్ తో కలిసి ట్రాన్స్‌జెండర్ల కమ్యూనిటీ డ్యాన్స్ వేస్తుండగా వచ్చే పాటను వేరే సింగర్లు పాడితే అంతగా వర్క్ అవుట్ అవదని అనిరుధ్ అభిప్రాయం. వారిని పిలిచి వాయీస్ ఆడిషన్ నిర్వహించిన తర్వాతే అవకాశం కల్పించామని దర్బార్ యూనిట్ చెబుతోంది. చెన్నైలో డిసెంబరు 7న దర్బార్ ఆడియో ఫంక్షన్ జరగనుంది.