Sarath Babu : శరత్ బాబు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు..

శరత్ బాబు మరణంతో టాలీవుడ్(Tollywood) లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కెరీర్ లో ఎంతోమంది ఆర్టిస్టులతో కలిసి నటించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

Tributes to Sarath baby by film and political celebrities

Sarath Babu : ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే నిన్న మే 22 సాయంత్రం మరణించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు 3000కి పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. ఆయన మరణంతో టాలీవుడ్(Tollywood) లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కెరీర్ లో ఎంతోమంది ఆర్టిస్టులతో కలిసి నటించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.