చెప్పింది వేరు.. చేస్తుంది వేరు.. అందుకే చిరు సినిమా చేయట్లేదు..

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి తప్పుకున్న త్రిష..

  • Publish Date - March 14, 2020 / 07:37 AM IST

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి తప్పుకున్న త్రిష..

చిరంజీవి, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు చెన్నై పొన్ను త్రిష సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ‘సైరా’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రమిది.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా త్రిషను ఫిక్స్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ చిత్రంలో తాను నటించడం లేదని.. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల మందుకు వస్తానని త్రిష ట్వీట్ చేసింది.

చిరు సినిమా నుంచి త్రిష తప్పుకుంది అనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘స్టాలిన్’ చిత్రంలో చిరంజీవి, త్రిష జంటగా నటించిన సంగతి తెలిసిందే. దసరా కానుకగా ‘ఆచార్య’  విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.
 

Also Read | హైదరాబాద్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బంద్..