Trivikram : బన్నీతో త్రివిక్రమ్ సినిమా అనౌన్స్.. నిరాశలో మహేష్ ఫ్యాన్స్

త్రివిక్రమ్ మహేష్ సినిమా షూట్ సగం కూడా అవకుండానే అల్లు అర్జున్ తో సినిమాని ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Trivikram Allu Arjun Movie announced Mahesh Fans Disappointed

Trivikram – Mahesh Babu Fans :  త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. మహేష్ అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా నిరాశలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుందని పూజా హెగ్డే (Pooja Hegde) కూడా సినిమా నుంచి తప్పుకుంది. ఇటీవల ఈ సినిమాని మొదలుపెట్టారని, షూట్ మొదలైందని చిత్రనిర్మాతలు ప్రకటించినా ఎలాంటి అప్డేట్స్, న్యూస్ లేవు. ఇక సంక్రాంతికి ప్రకటించిన ఈ సినిమా సమ్మర్ కి వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో త్రివిక్రమ్- మహేష్ సినిమా షూట్ సగం కూడా అవకుండానే అల్లు అర్జున్ తో సినిమాని ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు వచ్చి భారీ విజయాలు సాధించాయి. ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. తాజాగా వీరి కాంబోలో కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు.

Allu Arjun – Trivikram : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ మరోసారి.. ఈ సారి పాన్ ఇండియా సినిమా..

హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సారి వీరి కాంబోలో పాన్ ఇండియా సినిమా రాబోతుంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. దీనిపై బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రకటనతో మహేష్ అభిమానులు మాత్రం నిరుత్సాహపడుతున్నారు.

కొంతమంది మహేష్ అభిమానులు త్రివిక్రమ్ ని ట్రోల్ కూడా చేస్తున్నారు. ముందు మహేష్ సినిమా షూటింగ్ పూర్తిచేయమని కామెంట్స్ పెడుతున్నారు. ఇక కొంతమంది అయితే మహేష్ సినిమాని ఆపేయండి తీసే ఉద్దేశం లేకపోతే అని కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ త్రివిక్రమ్ సినిమాని కూడా ఇదే నిర్మాణ సంస్థలో తెరకెక్కిస్తున్నారు. మరి దీనిపై నిర్మాణ సంస్థ స్పందిస్తుందేమో చూడాలి.