Trivikram Srinivas
Trivikram Srinivas : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ ఒకరు. ఆయన డైలాగ్స్ కి, సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. చివరగా మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అవ్వకముందు రచయితగా పలు సినిమాలకు పనిచేసారు. వెంకటేష్ సూపర్ హిట్ సినిమా నువ్వు నాకు నచ్చావ్ కి త్రివిక్రమ్ కథ అందించి రచయితగా పనిచేసాడు.(Trivikram Srinivas)
నువ్వు నాకు నచ్చావ్ సినిమా జనవరి 1న రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్, నిర్మాత రవికిశోర్ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా రిలీజ్ తర్వాత జరిగిన ఓ సంఘటన గురించి తెలిపారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయ్యాక సంతాప సభలో ఉన్నోడిలా ఉంది నా పరిస్థితి. నేను భీమవరంలో ఉన్నాను. నేను సినిమా చూసి బయటకు వచ్చి అక్కడ థియేటర్ బయట ఉండేవాడిని అడిగాను సినిమా ఎలా ఉంది అని. వాడేమో రెండు వారాలు కూడా ఆడదు అన్నాడు. నేను సునీల్ బండి మీద వెళ్తే బండి వదిలేసి ఒక్కడినే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయా.
అప్పుడు నా పరిస్థితి అర్ధం చేసుకోండి ఇంక. ఇంటికెళ్లి మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్న. నేను సినిమాలకు పనికిరానేమో. ఏదో ఫ్లూక్ గా రాసి ఉంటాను కొన్ని సినిమాలు. నువ్వు చెప్పినట్టే నేను తప్పుచేశానమ్మా. లెక్చరర్ ఉద్యోగం చేసుకొని ఉంటే బాగుండేది అమ్మ అని బాధపడ్డా. పాపం మా అమ్మ బాధపడి భయపడింది.
అప్పుడు మీరు(నిర్మాత రవికిశోర్) ఫోన్ చేసి కంగారు పడకు నువ్వు హైదరాబాద్ రా అన్నారు. నేను హైదరాబాద్ వచ్చాక మీరు శాంతి థియేటర్ కి తీసుకెళ్లి చూస్తే హౌస్ ఫుల్. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. జనాల స్పందన చూసి ఆ రోజు రాత్రి హ్యాపీగా పడుకున్నా. ఏ థియేటర్ దగ్గర ఆడదు అన్నారో ఆ థియేటర్లోనే 300 డేస్ ఆడింది. ఫంక్షన్ చేస్తే నేను వెళ్ళాను అక్కడికి అని తెలిపారు.
Also See : Anaganaga Oka Raju : అనగనగా ఒక రాజు రిసెప్షన్ ఈవెంట్.. డ్యాన్సులతో రచ్చ చేసిన నవీన్, మీనాక్షి..
త్రివిక్రమ్ ఆ రోజు బాధపడి సినిమాలు వదిలేస్తే ఒక మంచి రచయిత, దర్శకుడిని కోల్పోయేవాళ్ళం అని ఫ్యాన్స్, ప్రేక్షకులు అంటున్నారు.