Rajasaab
Rajasaab : ప్రభాస్ రాజాసాబ్ సినిమాపై రిలీజ్ ముందు నుంచే ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజయినప్పుడు గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. కథ బాగున్నా దాన్ని సరిగ్గా తెరకెక్కించకపోవడం, సినిమా రిలీజ్ ని సరిగ్గా ప్లాన్ చేయకపోవడంతో రాజాసాబ్ సినిమా ఫలితం నిరాశే మిగిల్చింది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు.(Rajasaab)
సినిమాలో ప్రభాస్ బదులు చాలా సీన్స్ లో డూప్ నే వాడారు. ఫైట్స్, డ్యాన్స్ లలో ప్రభాస్ డూప్ ని వాడారు. సినిమా రిలీజ్ అయ్యాకే ఈ విషయం అందరికి అర్ధమయింది. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యాక ప్రభాస్ డూప్ సీన్స్ కట్ చేసి మరీ సోషల్ మీడియాలో వైరల్ చేసి డైరెక్టర్ పై ట్రోల్స్ చేసారు. అయితే ఇపుడు హీరోయిన్ కి కూడా డూప్ ని వాడారు అని వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది.
Also Read : Sukumar : చరణ్ సినిమా కోసం.. సుకుమార్ ఆ హీరోయిన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా?
ఈ ఫైట్ లో విలన్ గా చేసిన రాన్సన్ విన్సెన్ట్ తాజాగా ఆ ఫైట్ కి సంబంధిచి ఓ ఫోటో షేర్ చేసాడు. మాళవిక తో ఫైట్ చేస్తున్న ఫొటోతో పాటు మాళవిక కి డూప్ గా చేసిన వ్యక్తితో దిగిన ఫోటో కూడా షేర్ చేసాడు. మాళవిక కి డూప్ గా ఓ ఫైటర్ ని మాళవిక లాగే అమ్మాయిలా అదే కాస్ట్యూమ్స్ తో రెడీ చేసి ఈ ఫైట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఫోటో చూస్తుంటే మాళవికకి అబ్బాయిని డూప్ గా పెట్టినట్టు తెలుస్తుంది. మాళవిక ఫైట్ కి కూడా డూప్ ని వాడడమే అనుకుంటే ఆ డూప్ అబ్బాయి కావడం గమనార్హం.
దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ప్రభాస్ ఫ్యాన్స్, సినిమా లవర్స్.. అందర్నీ డూప్ లనే పెట్టి తీసారా అంటూ మరోసారి మారుతిపై కామెంట్స్ చేస్తున్నారు. రాజాసాబ్ రిలీజ్ తర్వాత మారుతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మొత్తానికి రాజాసాబ్ ఓటీటీలోకి వచ్చాక మరోసారి ట్రోల్ మెటీరియల్ అయి ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.
Also Read : Bollywood : మొన్న సల్మాన్.. ఇప్పుడు రణవీర్.. భయం గుప్పిట్లో బాలీవుడ్.. మళ్ళీ అదే గ్యాంగ్..