Womens Day : హ్యాపీ ఫూల్స్ డే అంటూ అనసూయ పోస్ట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా అనసూయ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అనసూయని, ఆ ట్వీట్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం.....

Anasuya

Anasuya :  జబర్దస్త్ లో యాంకర్ గా పేరు సంపాదించుకొని సినిమాల్లో బిజీ అయిపొయింది అనసూయ. ఒకపక్క పొట్టి పొట్టి బట్టలతో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ, మరో పక్క తన పోస్టులతో కాంట్రవర్సీలు కూడా క్రియేట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది అనసూయ. దీంతో అనసూయకి అభిమానులకన్నా విమర్శకులే ఎక్కువ అయ్యారు. తాజాగా మరోసారి అనసూయ నెటిజన్ల చేతిలో విమర్శల పాలవుతుంది.

ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా అనసూయ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అనసూయని, ఆ ట్వీట్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా అనసూయ తన ట్విట్టర్ లో.. ” ఇవాళ ప్రతి ట్రోలర్, మీమ్ మేకర్ హఠాత్తుగా మహిళలను గౌరవిస్తారు. అయినా ఇదంతా 24 గంటలు మాత్రమే. ఆ తర్వాత అంతా మామూలు అయిపోతుంది. కాబట్టి హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్వీట్ చేసింది. దానితో పాటు గుమ్మడికాయ దొంగలను కామెంట్స్ లో చూడొచ్చుఅంటూ మరో ట్వీట్ చేసింది.

Natti Kumar : సినిమా టికెట్ రేట్లపై ఇచ్చిన జీవోలో మరిన్ని సవరణలు కావాలి..

ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో పాటు చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొంతమంది.. జబర్దస్త్ లో ఆడవాళ్ళ మీద జోక్స్ వేస్తే నవ్వుతావు, నువ్వు కూడా వేస్తావు అలాంటిది నువ్వే ఇలా ట్వీట్ పెడుతుంటే నవ్వొస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది.. తెలుగు లేడీ యాంకర్లలో ఎవరిపై రాని ట్రోల్స్ మీపై వస్తున్నాయంటే తప్పు మీలోనే కదా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మీమ్ పేజీలు కూడా ఈ పోస్ట్ ని ట్రోల్ చ్రస్తూ మీమ్స్ వేస్తున్నాయి.