‘గుంటూరు కారం’కు తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్‌.. టికెట్ ధ‌ర పెంపు, బెన్‌ఫిట్ షోలకు అనుమ‌తి

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన చిత్రం 'గుంటూరు కారం'.

TS Government gave permission to Guntur Kaaram tickets price hike

Guntur Kaaram : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. ఈ క్ర‌మంలో తెలంగాణ ప్ర‌భుత్వం చిత్ర బృందానికి శుభవార్త చెప్పింది. సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు ప‌చ్చ‌జెండా ఊపింది. అంతేకాదు బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇచ్చింది.

సింగిల్ స్రీన్స్‌ల‌లో రూ.65, మ‌ల్టీఫెక్స్‌ల‌లో రూ.100 పెంచుకునే వెసులు బాటు క‌ల్పించింది. సూప‌ర్ స్టార్ అభిమానుల‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో 23 చోట్ల 12వ తేదీన అర్థ‌రాత్రి 1 గంట షోకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది. అంతేకాదండోయ్‌.. పండుగ నేప‌థ్యంలో ఆరో షోకు ఓకే చెప్పింది. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 4 గంట‌ల‌కు షోకు అనుమ‌తి ఇచ్చింది.

Kalki 2898 AD : కల్కి సినిమా ఆలస్యానికి కారణం చెప్పిన నాగ్ అశ్విన్

హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు కాగా.. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు లు కీలక పాత్రలను పోషించారు. ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ట్రైల‌ర్‌ను చూస్తుంటే మునుపెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త రోల్‌లో మ‌హేశ్ క‌నిపించిన‌ట్లుగా అర్థమ‌వుతోంది.