Kalki 2898 AD : కల్కి సినిమా ఆలస్యానికి కారణం చెప్పిన నాగ్ అశ్విన్

కల్కి సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతోంది? అనే ప్రశ్నకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అసలు కారణాలు చెప్పారు.

Kalki 2898 AD : కల్కి సినిమా ఆలస్యానికి కారణం చెప్పిన నాగ్ అశ్విన్

Kalki 2898 AD

Updated On : January 9, 2024 / 4:06 PM IST

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న కల్కి 2898 AD రిలీజ్ ఎప్పుడా? అని ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ రెండుసార్లు వాయిదా పడటంతో నిరాశే ఎదురైంది.  కల్కి ఆలస్యానికి అసలు కారణాలేంటో నాగ్ అశ్విన్ చెప్పారు.

Kalki 2898AD : ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ అప్పుడేనా? ఆ డేట్ బాగా కలిసొచ్చింది అని..

నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న కల్కి సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే హాలీవుడ్ రేంజ్‌ని మించి ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కల్కి సినిమా రిలీజ్ ఎప్పుడా? అని ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా సమ్మర్ రిలీజ్ ఉండవచ్చని అంటున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడానికి కారణాలు ఏంటో నాగ్ అశ్విన్ ఇటీవల చెప్పారు.

బాంబే ఐఐటీ టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇంజనీరింగ్ వర్క్‌కే  చాలా టైమ్ పడుతోందని అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందని వెల్లడించారు. మూవీ డైరెక్ట్ చేయడం కన్నా ఆ పనే ఎక్కువగా చేస్తున్నాననే ఫీలింగ్ కలుగుతోందన్నారాయన. సినిమా సెట్స్‌తో పాటు సినిమాలో కనిపించే ప్రతి ఆయుధం, వస్తువులను సరి కొత్తగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇప్పటివరకూ ఇండియన్ సినిమా హిస్టరీలో చూడని విధంగా కల్కి మూవీని నాగ్ అశ్విన్ చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా భవిష్యత్తు ప్రభాస్‌ని చూస్తారని నాగ్ అశ్విన్ చెబుతున్నారు.

12th Fail : కష్టాలను ఎదిరించి.. ప్రేమను గెలిపించుకున్న ఐపీఎస్ ఆఫీసర్.. 12th ఫెయిల్ సినిమా ఎవరి లైఫ్ స్టోరీనో తెలుసా?

సైన్స్ ఫిక్షన్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్-దీపిక పదుకోన్ జోడీగా నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.