Tuck Jagadish: భారీ ధరకు టక్ జగదీశ్ ఓటీటీ సొంతం!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న టక్ జగదీష్ ఒకటి. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది.

Tuck Jagadish

Tuck Jagadish: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న టక్ జగదీష్ ఒకటి. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. పూర్తిస్థాయి కమర్షియల్‌ హంగులతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది.

అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తగ్గి ఇప్పుడు థియేటర్స్ తెరుచుకుంటున్నా ఈ సినిమా విడుదలపై క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో సినిమా విడుదలపై పలు కథనాలు చక్కర్లు కొడుతూ వచ్చాయి. కానీ, ఎప్పటికప్పుడు సినిమా యూనిట్ కూడా వాటికి ఖండిస్తూ వస్తుంది. అయితే.. త్వరలోనే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుందని సమాచారం.

ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే ఆఫర్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరక్ట్ ఓటీటీ విడుదల కోసం అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.45 కోట్లను చెల్లించినట్లు వినికిడి. దీంతో టక్ జగదీష్ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉండగా త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించి ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. సన్ షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నారు.