Tumbbad 2: హస్తర్ మళ్ళీ వస్తున్నాడు.. ‘తుంబాడ్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద భయం మొదలు!

ఎట్టకేలకు తుంబాడ్ 2(Tumbbad 2) రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.

Tumbbad 2 movie releasing in 2027 december

  • మళ్ళీ వస్తున్న భయంకర హస్తర్.
  • డిసెంబర్ 3న ‘తుంబాడ్ 2’ విడుదల.
  • సోహమ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కలయిక.

Tumbbad 2: భారతీయ చలనచిత్ర చరిత్రలో కల్ట్ క్లాసిక్ హారర్ చిత్రాలలో ‘తుంబాడ్’ ఒకటి. చాలా కాలం నుంచి ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది అని అధికారిక ప్రకటన చేశారు. 2018లో వచ్చిన మొదటి భాగం తన విలక్షణమైన కథాంశంతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ‘తుంబాడ్ 2(Tumbbad 2)’ కోసం మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్‌లో సోహమ్ షాతో పాటు విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కూడా నటిస్తుండటం విశేషం.

Epic Teaser: ‘ఎపిక్’ టీజర్ వచ్చేసింది.. యూత్ ఫుల్ కంటెంట్ తో మరోసారి అదరగొట్టేసిన ‘బేబీ’ జంట

ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2027, డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. తొలి భాగంలో చూపించిన హస్తర్ పురాణం, మానవ అత్యాశ, మరుగున పడిన దేవుళ్ల రహస్యాలను ఈ సీక్వెల్‌లో మరింత లోతుగా, భారీ స్థాయిలో చూపించబోతున్నట్లు సోహమ్ షా వెల్లడించారు. 2024లో తుంబాడ్ మొదటి భాగాన్ని రీ-రిలీజ్ చేసినప్పుడు ఏకంగా రూ.30 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేయడం, ఈ కథపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని నిరూపించింది.

ఆ ఉత్సాహంతోనే మేకర్స్ రెండో భాగాన్ని మరింత అత్యాధునిక సాంకేతిక విలువలతో, భయాన్ని రెట్టింపు చేసే వాతావరణంతో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది ముంబైలో భారీ జనసందోహం మధ్య చిత్రీకరణను ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సీనియా విడుదల తరువాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.