Tunisha Sharma : ఆత్మహత్య చేసుకున్న తునీషా ప్రెగ్నెంటా?

హిందీ పరిశ్రమలో యువనటి ‘తునీషా శర్మ’ ఆత్మహత్య అందర్నీ షాక్‌కి గురి చేసింది. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో, హత్యకోణంలో కూడా దర్యాప్తు చేసిన పోలీసులు.. చివరికి ఆత్మహత్య అనే తెలిచారు. 15 రోజులు క్రిందట వీరిద్దరికి బ్రేకప్ అవ్వడంతో, అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి.

Tunisha Sharma is pregnant

Tunisha Sharma : హిందీ పరిశ్రమలో యువనటి ‘తునీషా శర్మ’ ఆత్మహత్య అందర్నీ షాక్‌కి గురి చేసింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ, అతితక్కువ కాలంలోనే ఎంతో ఫేమ్ ని సంపాదించుకుంది. టీవీ సీరియల్స్ లో నటిస్తూనే సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో కూడా ఛాన్స్ లు అందుకుంది. అందం అభినయం కలిసి ఉన్న తునీషా అనూహ్యంగా సూసైడ్ చేసుకోవడం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది.

Tunisha Sharma : తునీషా ఆత్మహత్యకి లవ్ బ్రేకప్ కారణం.. పోలీసులు!

సీరియల్ షూటింగ్ కి హాజరయ్యిన నటి.. అప్పటివరకు సెట్ లో సరదాగా అల్లరి చేసి, మరి కాసేపటిలోనే ఉరి తాడుకి వేలాడుతూ కనబడడంతో తోటి నటీనటులను కలిచివేసింది. సంఘటన స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ దొరక్కపోవడంతో, హత్యకోణంలో కూడా దర్యాప్తు చేసిన పోలీసులు.. చివరికి ఆత్మహత్య అనే తెలిచారు. తునీషా తన సహనటుడు షీజాన్ మహమ్మద్ ఖాన్‌తో ప్రేమలో ఉంది.

15 రోజులు క్రిందట వీరిద్దరికి బ్రేకప్ అవ్వడంతో, అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. అందువల్లే ఆమె సూసైడ్ కి పాల్పడింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నిన్న పోస్ట్‌మార్టం నిర్వహించిన డాక్టర్లు ఆమె గర్భవతి కాదంటూ నిర్దారించారు. దీంతో ప్రెగ్నెంట్ అన్న వార్తలకి చెక్ పడింది. కాగా ప్రియుడు షీజాన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోని నాలుగు రోజులు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.