Tunnel : తమిళ్ హీరో అథర్వ మురళీ క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్స్ లో సినిమా తీస్తే అది పక్క హిట్ అవుతుంది. ఇప్పుడు అథర్వ టన్నెల్ అనే మరో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. రవీంద్ర మాధవ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ్ సినిమా ‘టన్నెల్’ సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రానుంది. అదే రోజు తెలుగులో కూడా డబ్బింగ్ తో ఎ.రాజు నాయక్ లచ్చురామ్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.(Tunnel)
ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో అథర్వ మురళీ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపిస్తున్నాడు. ఒక టన్నెల్ ని బేస్ చేసుకొని జరిగే దొంగతనాలు, హత్యలు, అవి చేసుకునే వాళ్ళను హీరో ఎలా పట్టుకున్నాడు అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
తెలుగులో కూడా అథర్వ మురళీ వచ్చి ప్రమోషన్స్ చేయనున్నాడు. మరి ప్రస్తుతం ప్రగ్నెన్సీ తో ఉన్న లావణ్య ప్రమోషన్స్ కి వస్తుందో లేదో చూడాలి. మీరు కూడా టన్నెల్ ట్రైలర్ చూసేయండి..