Bollywood Drugs Case: డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన నటి ప్రీతిక..

  • Published By: sekhar ,Published On : October 25, 2020 / 08:22 PM IST
Bollywood Drugs Case: డ్రగ్స్ కొంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన నటి ప్రీతిక..

Updated On : October 28, 2020 / 1:14 PM IST

Preetika Chauhan: గతకొద్ది కాలంగా బాలీవుడ్ పరిశ్రమ డ్రగ్స్ వ్యవహారంతో సతమతమవుతోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.

తాజాగా టీవీ నటి ప్రీతికా చౌహన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఎన్సీబీ పట్టుపడింది.. స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ఆమె రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో బాలీవుడ్ పరిశ్రమ ఉలిక్కి పడింది.

‘Savdhaan India’, ‘Devo ke Dev Mahadev’ వంటి సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమెను కిల్లా కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు తెలిపారు.