Pushpa 2 collections : బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప‌రాజ్ హ‌వా.. రెండు రోజుల్లో పుష్ప 2 క‌లెక్ష‌న్ ఎంతంటే?

బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప‌రాజ్ త‌న హ‌వాను కొన‌సాగిస్తున్నాడు

Two days worldwide collection of Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మూవీ పుష్ప‌2. బాక్సాఫీస్ వ‌ద్ద పుష్ప‌రాజ్ త‌న హ‌వాను కొన‌సాగిస్తున్నాడు. రెండు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 449 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలో భార‌తీయ సినీ చరిత్ర‌లో రెండు రోజుల్లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన మూవీగా ఈ చిత్రం రికార్డుల‌ను క్రియేట్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

ఈ విష‌యం తెలిసిన బ‌న్నీ అభిమానులు తెగ ఆనందప‌డిపోతున్నారు. కాగా.. తొలి రోజు ఈ చిత్రం రూ.294 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక దేవ‌ర సినిమా పుల్ ర‌న్ 500 కోట్లకు పైగా క‌లెక్ష‌న్లు సాధించ‌గా పుష్ప మూడు రోజుల్లోనే 500 కోట్ల క‌బ్‌లో చేర‌నుంది.

Ranveer Singh – Naveen Polishetty : రణ్‌వీర్ సింగ్ యాడ్ అని చెప్పి మోసం చేసారు.. ఆ తర్వాత రణ్‌వీర్ తోనే..

ఈ సినిమా జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే 1000 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెడుతుంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈ చిత్రంలో ర‌ష్మిక మంధాన హీరోయిన్‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ చిత్రంలో అన‌సూయ‌, ఫ‌హాద్ ఫాజిల్‌, సునీల్ లు కీల‌క పాత్ర‌లో న‌టించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్ లు నిర్మించారు. పుష్ప‌కు సీక్వెల్‌గా డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మార‌థం ప‌డుతున్నారు.

Naveen Polishetty : ఓ రెస్టారెంట్ సర్వర్ కి ఫోన్ చేసి మరీ హెల్ప్ చేసిన నవీన్ పోలిశెట్టి.. అన్ని పోగొట్టుకొని డిప్రెషన్ లో ఉన్నప్పుడు..