Ranveer Singh – Naveen Polishetty : రణ్‌వీర్ సింగ్ యాడ్ అని చెప్పి మోసం చేసారు.. ఆ తర్వాత రణ్‌వీర్ తోనే..
తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి ముంబైలో అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో జరిగిన ఓ ఘటన గురించి తెలిపాడు.

Naveen Polishetty Reveals Interesting thing with Ranveer Singh in Mumbai
Ranveer Singh – Naveen Polishetty : నవీన్ పోలిశెట్టి హీరో కాకముందు చాలా కష్టాలే పడ్డాడు. చిన్న చిన్న పాత్రలతో, యాడ్స్ లో, యూట్యూబ్ లో నటించాడు. ముంబై వెళ్లి బాలీవుడ్ లో కూడా ఛాన్సుల కోసం కష్టపడ్డాడు. ఈ క్రమంలో వచ్చిన ప్రతి ఛాన్స్ వాడుకున్నాడు. తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన నవీన్ పోలిశెట్టి ముంబైలో అవకాశాల కోసం ట్రై చేస్తున్న సమయంలో జరిగిన ఓ ఘటన గురించి తెలిపాడు.
నవీన్ మాట్లాడుతూ.. ముంబైలో ఏ చిన్న ఛాన్స్ వచ్చినా చేసేవాడ్ని. యాడ్స్ లో కూడా చిన్న చిన్న రోల్స్ చేశాను. ఓ సారీ రణవీర్ సింగ్ యాడ్ అతన్ని ఫోటోలు తీసే క్యారెక్టర్ అని ఓ యాడ్ షూట్ కి నన్ను సెలెక్ట్ చేశారు. నేను రణవీర్ తో యాడ్ అని తెగ ఫీల్ అయ్యాను. షూటింగ్ రోజు రెంట్ కి ఒక సూట్ కూడా తీసుకొని వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్లి చూస్తే నాలాంటి వాళ్ళు ఓ 50 మంది ఉన్నారు. అప్పటిదాకా నేను ఒక్కడినే యాడ్ లో క్యారెక్టర్ అనుకున్నా, నాకు వాళ్ళు అలాగే చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటంటే రణవీర్ రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తుంటే ఫోటోగ్రాఫర్స్ టకాటకా ఫోటోలు తీస్తారు. అలా ఓ 50 మందిలో నేను కూడా ఒకడ్ని. కానీ అదే రణవీర్ సింగ్ తో జాతిరత్నాలు సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నాను అని తెలిపారు.