Uday Kiran missed hero chance in Mahesh Babu Athadu
Uday Kiran : తెలుగు హీరో ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ మంచి స్టార్‌డమ్ ని సంపాదించుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో వరుస హిట్స్ అందుకున్న ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోని అందరి దృష్టిని ఆకర్షించాడు. లవ్ అండ్ ఫ్యామిలీ సినిమాలకు ఉదయ్ అప్పటిలో బెస్ట్ ఆప్షన్ గా కనిపించేవాడు. ఈక్రమంలోనే ఉదయ్ కిరణ్ దగ్గరకి మహేష్ బాబు నటించిన అతడు సినిమా కూడా వెళ్లిందట. కానీ అది ఉదయ్ కిరణ్ చేయలేకపోయాడు. ఈ విషయాన్ని ఆ మూవీ నిర్మాత అయిన మురళి మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
Also read : Yatra 2 : యాత్ర 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. వైఎస్ఆర్‌గా మమ్ముట్టి.. వైఎస్ జగన్ పాత్రలో జీవా..
2005లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘అతడు’ సినిమా మహేష్ కెరీర్ లో మంచి సినిమాగా మిగిలిపోయింది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రాన్ని ముందుగా ఉదయ్ కిరణ్ కి వినిపించారట. తను కూడా ఒకే చెప్పాడు, ఉదయ్ తెరకెక్కించడానికి మేకర్స్ కూడా సిద్ధమయ్యారు. అయితే ఉదయ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆ మూవీ మిస్ అయ్యింది. దీంతో ఉదయ్ నుంచి మహేష్ దగ్గరకి ఆ సినిమా వెళ్ళింది. ఇప్పుడు ఈ విషయం మురళి మోహన్ తెలియజేయడంతో నెట్టింట వైరల్ గా మారింది.
Also read : Mad Collections : ఎన్టీఆర్ బామ్మర్ది మొదటి సినిమాతో అదరగొట్టాడు.. మూడు రోజుల్లో కలెక్షన్స్..
ఇది చూసిన నెటిజెన్స్.. ఉదయ్ కిరణ్ కి ఆ సినిమా పడి ఉంటే తన కెరీర్ ఇంకో రేంజ్ ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఉదయ్ కిరణ్.. ‘చిత్రం’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’, ‘కలుసుకోవాలని’.. వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. కానీ ఆ తరువాత సరైన హిట్స్ పడగా ఇబ్బందులు పడ్డాడు. 33 ఏళ్ళ వయసులో జనవరి 5న ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. తన మరణం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది.