Udhayanidhi Stalin: విశాల్, నేను చిన్నప్పటి ఫ్రెండ్స్.. కలిసి చాలానే చేశాం సినిమా తప్ప అంటున్న సీఎం తనయుడు..

ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ.. ''విశాల్‌ కాల్‌ షీట్స్‌ కోసం నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. కాని మాకు టైం ఇవ్వట్లేదు. నేను, విశాల్‌ మంచి స్నేహితులం, కలిసే స్కూల్ కి, కాలేజీకి వెళ్ళాం. ఆ సమయంలో.........

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin:  తెలుగు వాడైనా తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు విశాల్. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసే విశాల్ తాజాగా లాఠీ అనే మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఇటీవలే లాఠీ టీజర్ రిలీజ్ అయింది. ఫుల్ మాస్ యాక్షన్ టీజర్ గా ఉంది. ఈ టీజర్ ని తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ విశాల్ తో తనకున్న స్నేహం గురించి మాట్లాడాడు.

Disha Patani : ప్రభాస్ తో వర్క్ కంఫర్ట్ గా ఉంటుంది.. ఆయనే వడ్డిస్తారు..

ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ.. ”విశాల్‌ కాల్‌ షీట్స్‌ కోసం నేను చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. కాని మాకు టైం ఇవ్వట్లేదు. నేను, విశాల్‌ మంచి స్నేహితులం, కలిసే స్కూల్ కి, కాలేజీకి వెళ్ళాం. ఆ సమయంలో మేము కలిసి చాలా ఎంజాయ్ చేశాం. ఆ విషయాలు చెప్పకూడదు. కాని విశాల్ తో కలిసి సినిమా మాత్రం చేయలేకపోయాను. ఇప్పటివరకు విశాల్ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా, కమిషనర్‌గా అన్ని పాత్రలు పోషించి ఇప్పుడు కానిస్టేబుల్‌ పాత్ర చేస్తున్నారు వెరైటీగా. విశాల్‌ త్వరగా నడిగర్‌ సంఘం భవన నిర్మాణాన్ని పూర్తిచేసి, త్వరగా పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను” అన్నారు.